Former Minister Chandulal: తెలంగాణ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, ఎన్టీఆర్, కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పని చేశారు. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్‌సభకు చందూలాల్ ఎన్నికయ్యారు. 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొంది. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. చందూలాల్ మృతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చందూలాల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్పంచ్ నుంచి చందూలాల్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్లు చెప్పారు. ములుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వంగల్ ఎంపీగా రెండు సార్లు గెలుపొందారని అన్నారు. అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీకి మంత్రిగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన సుదీర్ఘకాలం పాటు గిరిజన నేతగా, గిరిజన సంక్షేమ మంత్రిగా చేసిన సేవలు మరువలేనవని అన్నారు. కాగా, అయితే 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మాజీ మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/gndjgMVQS3
— Eatala Rajender (@Eatala_Rajender) April 15, 2021
ఇవీ చదవండి: YS Sharmila Deeksha: దీక్ష భగ్నానికి పోలీసుల ప్రయత్నం.. వైఎస్ షర్మిల దీక్షతో లోటస్‌పాండ్‌లో హైటెన్షన్..