
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(Telangana Formation Day) సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం దేశ రాజధానిలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన తెలిపింది. ఈ కార్యక్రమంలో షాతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా పాల్గొంటారు. అయితే.. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్న మంత్రులు,ప్రతినిధులు వీరే…
హైదరాబాద్- సీఎం కేసీఆర్
1.ఆదిలాబాద్ గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్
2.కొత్తగూడెం రేగా కాంతారావు
3.జగిత్యాల- మంత్రి కొప్పుల ఈశ్వర్
4.భూపాలపల్లి-రాజీవ్ శర్మ ప్రభుత్వ సలహాదారు
5.జనగామ-జీఆర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు
6.గద్వాల్-అనురాగ్ శర్మ ప్రభుత్వ సలహాదారు
7.కామారెడ్డి-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
8.ఖమ్మం-మంత్రి పువ్వడా అజయ్
9.కరీంనగర్-మంత్రి గంగుల కమలాకర్
10.అసిఫాబాద్-అరికెపుడి గాంధీ
11.మహబూబ్ నగర్-మంత్రి శ్రీనివాస్ గౌడ్.
12.మహబూబా బాద్-మంత్రి సత్యవతి రాధోడ్.
13.మంచిర్యాల-బాల్క సుమన్
14.మెదక్-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
15.మేడ్చల్-మంత్రి మల్లారెడ్డి
16.ములుగు-ప్రభకర్ రావు ప్రభుత్వ విప్
17.నాగర్ కర్నూల్-గువ్వల బలరాజ్.
18.వనపర్తి-మంత్రి నిరంజన్ రెడ్డి
19.నిర్మల్-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
20.సిరిసిల్ల-మంత్రి కేటీఆర్
21.సిద్దిపేట-హరీష్ రావు
22.నల్గొండ-గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్
23.నిజామాబాద్-మంత్రి ప్రశాంత్ రెడ్డి
24.సూర్యాపేట -మంత్రి జగదీశ్ రెడ్డి
25.నారాయణ్ పెట్-రమణ చారి ప్రభుత్వ సలహాదారు
26.వికారాబాద్-డిప్యూటీ స్పీకర్ పద్మారావు
27.రంగారెడ్డి-సబితా ఇంద్రారెడ్డి
28.సంగారెడ్డి-హోమ్ మంత్రి మహమూద్ అలీ
29.పెద్దపల్లి-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
30.హన్మకొండ-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
31.వరంగల్-దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ విప్
32.యాదాద్రి భువనగిరి-గొంగిడి సునీత ప్రభుత్వ విప్