Save Snakes: బుట్టలోని పాముకు పాలు పోస్తున్నారా.. అయితే మీరు జైలుకు వెళ్లినట్లే..

నాగుల పంచమి రోజున పాములకు పాలు పోయొద్దు.. ఇలా చెప్పిందో  అటవీశాఖ హెచ్చరించింది. పాములు పాలు తాగవని... కాబట్టి అనవసరంగా పుట్టల్లో పాలు పోసి వాటిని హింసించవద్దని సూచించారు. శ్రావణ మాసం శుక్ల పక్ష ఐదవ రోజున నాగ పంచమి..

Save Snakes: బుట్టలోని పాముకు పాలు పోస్తున్నారా.. అయితే మీరు జైలుకు వెళ్లినట్లే..
Save Snakes

Updated on: Aug 13, 2021 | 9:09 AM

నాగుల పంచమి రోజున పాములకు పాలు పోయొద్దు.. ఇలా చెప్పిందో  అటవీశాఖ హెచ్చరించింది. పాములు పాలు తాగవని… కాబట్టి అనవసరంగా పుట్టల్లో పాలు పోసి వాటిని హింసించవద్దని సూచించారు. శ్రావణ మాసం శుక్ల పక్ష ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈసారి 2021 ఆగస్టు 13 న నాగ్ పంచమి పండుగ జరుపుకుంటారు. ఈ రోజున పాములను పూజిస్తారు.. అయితే నాగుల పంచమి కావడంతో కొంతమంది పాములు పట్టేవారు ఆలయాల వద్ద ప్రత్యేక్షమవుతారు. పాము కనిపించిందిగా.. అంటూ వారి వారికి ఓ రూ. 20 ఇచ్చి పుట్టలో పోయాల్సిన పాలు కాసా.. బుట్టలో పోస్తే మీపై కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

నాగపంచమీ రోజు సర్పాలను రక్షించండి అంటూ తెలంగాణ ఆటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాములు పట్టి బట్టల్లో పెట్టుకుిన తిరిగేవారికి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని కోరారు. 10 రోజుల పాటు వాటికి ఆహారం, నీరు ఇవ్వకుండా ఆ సర్పాలను హింసించి నాగుల పంచమి రోజు గుడికి తీసుకొస్తారని.. అందుకే అవి పాలు తాగుతాయని అధికారులు వివరణ ఇచ్చారు.

కాబట్టి ఇలా సర్పాలను హింసించేవారిని ప్రోత్సహించవద్దని సూచించారు. శుక్రవారం(ఆగస్టు 13) నాగుల పంచమి సందర్భంగా అటవీశాఖ అధికారులు ఈ సూచన జారీ చేశారు. నాగుల పంచమి రోజు పాములు పట్టేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

DFOలు,FROలు,స్నేక్ సొసైటీ సభ్యులు,NGOలతో కలిసి పాములు పట్టేవారిని గుర్తిస్తామన్నారు. పాములు పట్టేవారు కనిపిస్తే 8002455364 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.పాములు పాలు తాగుతాయనే ప్రచారం మూఢ నమ్మకమని, అలాంటి వాటిని నమ్మవద్దని అటవీశాఖ చాలా ఏళ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పాములను ఆడించడం, పాలు పట్టడం వంటివి చేస్తే వన్యప్రాణి చట్టం ప్రకారం నేరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. పుట్టలో పాలు పోసినా,పాములను ఆడించినా జైలుకు పంపిస్తామని గతంలో అటవీశాఖ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..