
Hyderabad: హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా ఐదు కార్లు ఢీ కొన్నాయి. అతివేగంతో వచ్చిన ఓ కారు ముందు వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే దాని వెనుకాల వచ్చిన మరో ఐదు వాహనాలు కూడా వరసుగా ఢీ కొన్నాయి. అయితే.. అంతా జాగ్రత్తగా ఉండడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దాని వెనుకాల స్పీడ్‌గా వస్తున్న కార్లు.. ఒక దానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచి పోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..