AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ నెల 19లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రైతులకు తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్.. వెంటనే చేస్కోండి..

తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. సన్న బియ్యం సాగు చేసే రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 ప్రభుత్వం బోనస్ అందిస్తుంది. ఇందుకోసం 7 వరి రకాలను గుర్తించింది. వీటిని పండించినవారికి మాత్రమే నగదు అందుతుంది.

Telangana: ఈ నెల 19లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రైతులకు తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్.. వెంటనే చేస్కోండి..
Telangana
Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 2:44 PM

Share

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. సన్న బియ్యం సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. 2026-27 వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందించే విషయంలో రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వం గుర్తించిన వరి రకాలను సాగు చేసిన రైతులకు మాత్రం బోనస్ అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 7 రకాల వరి వంగడాలను గుర్తించింది. వీటిల్లో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 వంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కొనుగోలు చేస్తోంది. దీంతో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేస్తోంది.

ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయించుకోవాలి..?

మీరు ఏ డీలర్ వద్ద అయితే విత్తనాలు కొనుగోలు చేశారో.. అక్కడ ఏ రకం అనేది ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. డీలర్లు రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఏ వరి రకం అనేది నమోదు చేస్తారు. ఏడు రకాల్లో ఏ వరి రకం సాగు చేస్తున్నా డీలర్ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆగస్ట్ 19వ తేదీ వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈలోపు తప్పనిసరిగా రైతులు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన రైతులకు మాత్రమే సన్న వడ్లపై క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం నుంచి అదుతుంది. నమోదు చేయించుకోకపోతే ఈ నగదు పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. రైతులు విత్తనాలు కొనుగోల చేసినప్పుడు డీలర్ ఇచ్చే బిల్లు లేదా రసీదును విక్రయదారుడికి అందించాలి. దీంతో విక్రయదారులు ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను నమోదు చేస్తారు.

ఆన్‌లైన్‌లో రైతులు వివరాలు నమోదు చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వాళ్లు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయరు. దీంతో దళారులకు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రైతులు విత్తనాల డీలర్‌ను సంప్రదించి ఆన్‌లైన్‌లో వివరాలను సమర్పించాలి. దీంతో రైతులు వెంటనే ఈ పని చేయడం మంచిది. ఒక్కరోజే మాత్రమే సమయం ఉండటంతో ఇంకా నమోదు చేయించుకోని రైతులు వెంటనే ఈ పని పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోంది.

Follow Us