సింగరేణి ఎన్నికల్లో మరో బిగ్ ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. కారణం మీరంటే మీరని కార్మిక సంఘాల మధ్య ఫైట్ పీక్స్ చేరింది. ఏదో కారణంతో వాయిదాలు పడుతూ వస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియకు మరోసారి బ్రేకులు పడనున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 27న జరగాల్సిన పోలింగ్ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయా..? తాజాగా ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్నీ మీమాంస మొదలైంది.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం పీక్స్ చేరిన టైమ్‌లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. డిసెంబర్ 27న పోలింగ్ జరగాల్సి వుంది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యలో పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకానికి మరింత గడువు కావాలని కోరింది. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. పిటిషన్ వెనుక NITUC రాజకీయం వుందని ఆరోపించింది ఏఐటీయూసీ.
ఏదో కారణంతో వాయిదాలు పడుతూ వస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు డిసెంబర్ 27న జరపాలని నోటిపికేషన్ కూడా విడుదల కాగా కార్మిక సంఘాలు కూడా కార్యక్షేత్రంలోకి దిగి తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రచారంలో కార్మిక సంఘా ప్రతినిధులు దూసుకుపోతున్న క్రమంలో ఇంధన శాఖ హై కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న చర్చ మొదలైంది కార్మికుల్లో.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ, ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఉన్నాయని ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు జరిపేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సమయం అవసరం ఉన్నదని అందులో పేర్కొంది. ఈ పిటిషన్ ను సోమవారం హైకోర్టు విచారించనున్నందున ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న చర్చ కార్మిక వర్గాల్లో మొదలైంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే సింగరేణిలో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో హై కోర్టును ఆశ్రయించడంతో వాయిదా వేయాలని ఆదేశించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకోలేమని ఇంధన శాఖ హై కోర్టును ఆశ్రయించడంతో ఎలాంటి తీర్పు రానుందోనన్న విషయంపై అటు కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇటు కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. నాలుగేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎదో ఓ కారణం చేత గుర్తింపు సంఘం ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతూనే ఉండడం… తాజాగా మరోసారి హైకోర్టుకు ఈ అంశం చేరడం గమనార్హం.
ఈ పిటిషన్ వెనుక NITUC రాజకీయం వుందని ఆరోపించింది ఏఐటీయూసీ. అయితే చేసిందంతా చేసి తమను బద్నాం చేస్తున్నారని NITUC ప్రత్యారోపణ చేశారు. పరస్పర ఆరోపణలు ఎలా వున్నా తాజా పిటీషన్‌తో సింగరేణి ఎన్నికలపై మరోసారి నీలి నీడలు కుమ్ముకున్నాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదంటే మళ్లీ వాయిదాలపర్వమేనా అనే చర్చ జరుగుతోంది సింగరేణిలో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…