Telangana: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ చార్జీల పెంపు ఉంటుందా.. ఇదిగో క్లారిటీ

టారిఫ్ పెంపు అయితే లేదు.. అది కొంతవరకు రిలీఫ్. కానీ ఇంధన సర్‌చార్జి పేరుతో కొంతమేర వాయింపు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ చార్జీల పెంపు ఉంటుందా.. ఇదిగో క్లారిటీ
Electricity Charges
Follow us

|

Updated on: Dec 01, 2022 | 12:19 PM

నిత్యావసరధరలు, గ్యాసు, చమురు రేట్ల పెంపుతోనే సామాన్యులు భారంగా బతుకెళ్లదీస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు ఛార్జీల మోత మరింత పెరిగితే సామాన్యుడి నడ్డి విరిగినట్లే. తెలంగాణలో మరోసారి విద్యుత్‌ చార్జీల మోత మోగనుందా? అంటే ఏమో అది జరిగినా ఆశ్చర్యం మాత్రం లేదు. అయితే భారీ స్థాయిలో మాత్రం ఉండదు. విద్యుత్ పంపిణీ సంస్థలు 2023-24కి ఎటువంటి ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు. ఇది అన్ని వర్గాల వినియోగదారులకు ఉపశమనం కలిగించినప్పటికీ, విద్యుత్ బిల్లులు నెలవారీగా మారవచ్చు. ఏప్రిల్ 2023 ఇంధనాల ధర ఆధారంగా 2023-24 సంవత్సరానికి తమ ఆదాయ వ్యత్యాసాన్ని రూ.10,535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని డిస్కమ్‌లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి తెలియజేశాయి. రెండు డిస్కమ్‌లు – సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL), నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) – 2023-24కి సంబంధించి తమ మొత్తం ఆదాయ అవసరాలను బుధవారం ERCకి సమర్పించాయి. టారిఫ్‌ల పెంపును ప్రతిపాదించనప్పటికీ.. డిస్కమ్‌లు కోరినట్లుగా, 2023 ఏప్రిల్ నుండి ఇంధన సర్‌చార్జికి అన్ని వర్గాల వినియోగదారులకు యూనిట్‌కు 30 పైసల వరకు టారిఫ్‌ను పెంచడానికి డిస్కమ్‌లను అనుమతిస్తూ ERC ఇటీవల డ్రాఫ్ట్ ప్రతిపాదనలను జారీ చేసింది. అందువలన ఏప్రిల్ నుంచి కరెంట్ చార్జీలు స్వల్పంగా పెరగవచ్చు.

ఈ వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో పెడతాం అన్నారు ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావు. డిస్కమ్స్‌ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తీసుకుంటాం.. పబ్లిక్ సమావేశాల తర్వాత ఛార్జీలు పెంచాలా? తగ్గించాలా? అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక, 500 యూనిట్లు వినియోగించే వినియోగదారులకు ప్రీ పెయిడ్ మీటర్స్ పెట్టుకోవాలని డిస్కంలు సూచించాయన్న ఆయన.. యూనిట్‌కు 30 పైసలు డిస్కంలు పెంచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.. ఇప్పటి వరకు డిస్కంలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం డిస్కంలకు ఇచ్చే నిధులను సకాలంలో అందజేస్తాయని వారి భావిస్తున్నట్టు తెలిపారు.

కాగా, తెలంగాణలో ఈ మధ్యే విద్యుత్‌ చార్జీలు పెరిగాయి.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పచ్చజెండా ఊపడంతో.. విద్యుత్ ఛార్జీలను 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. మరి డిస్కంల నివేదికపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక  27.62 లక్షల మంది రైతులకు 24X7 ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) గృహ వినియోగదారులకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కొనసాగుతుందని డిస్కామ్స్ ERCకి తెలియజేశాయి. నయీబ్రాహ్మణులు, చాకలివారు నడుపుతున్న లాండ్రీలు, పవర్‌లూమ్‌లు, పౌల్ట్రీ ఫామ్‌లు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌కు రూ.2 రాయితీ కొనసాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..