Kavitha vs Aravind: వ్యక్తిగతంగా దూషించే రాజకీయాలను అనుమతిద్దామా..? – ఎమ్మెల్సీ కవిత

|

Oct 18, 2023 | 6:29 PM

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ నిజామాబాద్‌లో రాజ‌కీయం వెడెక్కుతుంది. ఉప్పు నిప్పుగా ఉండే ఎమ్మెల్సీ క‌విత, ఎంపీ అర్వీంద్ ప‌ర‌స్పర ఆరోప‌ణ‌లతో మరింత పోలిటిక‌ల్ హీట్ పుట్టిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో జ‌రిగిన స‌మావేశంలో అర్వీంద్ చేసిన ఆరోప‌ణ‌లు.. దానికి సోష‌ల్ మీడియా వేదికగా క‌విత వీడియో రీలీజ్ చేయ‌డంతో ఇంకా హీట్ పెంచింది.

Kavitha vs Aravind: వ్యక్తిగతంగా దూషించే రాజకీయాలను అనుమతిద్దామా..? - ఎమ్మెల్సీ కవిత
Kavitha, Aravind
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ నిజామాబాద్‌లో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఉప్పు నిప్పుగా ఉండే ఎమ్మెల్సీ క‌విత, ఎంపీ అర్వింద్ ప‌ర‌స్పర ఆరోప‌ణ‌లతో మరింత పోలిటిక‌ల్ హీట్ పుట్టిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో జ‌రిగిన స‌మావేశంలో అర్వింద్ చేసిన ఆరోప‌ణ‌లు.. దానికి సోష‌ల్ మీడియా వేదికగా క‌విత వీడియో రీలీజ్ చేయ‌డంతో ఇంకా హీట్ పెంచింది.

నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత, ఎంపీ అర్వింద్ మ‌ధ్య మాట‌ల యుద్దం తారాస్థాయికి చేరింది. నిజామ‌బాద్ అర్బన్‌లో జ‌రిగిన బీజేపీ విస్తృత స్థాయి స‌మావేశంలో అర్వింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పోలిటిక‌ల్‌గా తీవ్ర చ‌ర్చకు దారి తీశాయి. మేనిపెస్టో గురించి మాట్లడుతూ అర్వింద్.. బీఆర్ఎస్ జీవిత భీమాకు ధీటుగా త‌న సొంత మేనిపెస్టో ప్రక‌టించారు అర్వింద్. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దానితో పాటు క‌విత కాంగ్రెస్‌లోకి ప‌లువురు బీఆర్ఎస్ నేతలను పంపిస్తున్నారంటూ ఆరోపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్వీంద్ వ్యాఖ్యలపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ క‌విత. సోష‌ల్ మీడియా వేదికగా కౌంటర్ వీడియోను రీలిజ్ చేశారు. వ్యక్తిగత కక్షలకు తెలంగాణలో తావులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను దూషించే నేతల్ని దూరం పెట్టాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో ఓడిపోయినా చాలా హుందాగా పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానన్నారు. బాధ్యతను విస్మరించిన ఎంపీ ఇష్టం వచ్చినట్లు తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేదీ లేదని హెచ్చరించారు కవిత.

ఇదిలావుంటే అర్వింద్ గెలిచిన నాలుగేళ్లల్లో ఎక్కడ అర్వింద్ పేరును ప్రస్తావించ‌లేదు కవిత. ఆరోప‌ణ‌లు కూడ అర్వింద్ పేరుతో చేయ‌కుండా స్ట్రాట‌జీగా వ్యవహరించిన క‌విత.. చివ‌రికి పైర్ బ్రాండ్ లెవ‌ల్‌లో విరుచుకుప‌డ్డారు. దీంతో అటు మహిళా నేతలు, మహిళల సానుభూతి కూడా క‌వితకు రావ‌డంతో డిపెన్స్‌లో ప‌డ్డారు ఎంపీ అర్వింద్. ప్రజ‌లే తేల్చాలి.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలని క‌విత అప్పీల్ చేయ‌డం చ‌ర్చనీయ‌శంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..