Telangana: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ బాస్‌.. తొలి సభ అక్కడి నుంచే ఎందుకు.?

ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌లో జరిగే మొదటి సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు..ఈ సభలోనే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు హుస్నాబాద్‌పై పడింది. కేసీఆర్‌ హుస్నాబాద్‌ సభ నుంచే ఎందుకు ప్రచారం మొదలుపెడుతున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే దీని వెనకాల ఉన్న కారణాన్ని...

Telangana: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ బాస్‌.. తొలి సభ అక్కడి నుంచే ఎందుకు.?
CM KCR
Follow us
P Shivteja

| Edited By: Narender Vaitla

Updated on: Oct 10, 2023 | 5:12 PM

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడుపెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ప్రచారాలతో హోరెత్తిస్తుంటే. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌లు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ను పెంచేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.

ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌లో జరిగే మొదటి సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు..ఈ సభలోనే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు హుస్నాబాద్‌పై పడింది. కేసీఆర్‌ హుస్నాబాద్‌ సభ నుంచే ఎందుకు ప్రచారం మొదలుపెడుతున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే దీని వెనకాల ఉన్న కారణాన్ని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేసీఆర్‌ నిర్వహించబోయే సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లోని కార్యకర్తల మీద నమ్మకంతోనే సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్ పార్టీకి కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం తెలిపారన్నారు మంత్రి. తెలంగాణలో మూడోసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మంత్రి అన్నారు. అసత్య సర్వేలతో కాంగ్రెస్‌ గ్లోబల్స్‌ ప్రచారం చేస్తుందన్న మంత్రి, కనీసం పార్టీలో ఉన్న నేతలకు టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు.

హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమని హరీష్‌ రావు అన్నారు. ఈ నెల 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయమని, 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క హామీ కుడా అమలు చేయలేదని, 2004లో తెలంగాణ ఇస్తామని బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ను మింగేయాలని చూసిందని చెప్పుకొచ్చారు.

మూడు గంటల కరెంట్ ఇస్తామని అంటున్న కాంగ్రెస్‌ కావాలా.? పొలాల దగ్గర మీటర్లు పెడుతామంటున్న బీజేపీ కావాలా.? 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలా.? అని రైతులు ఆలోచించుకోవాలని హరీష్‌ రావు అన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని, బీజేపీ వాళ్లు తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందన్నారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ల చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుందని దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!