టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు సమిష్టి విజయంగానే భావిస్తామని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా తనకు కూడా క్రెడిట్ ఉంటుందంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. టీవీ9 పొలిటికల్ కాంక్లేవ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానాలు, గ్యారెంటీలు, హామీలతోపాటు.. పొలిటికల్ విమర్శలు, సవాళ్లపైనా విస్తృతంగా మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తంచేసిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు వస్తాయని.. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటవంటూ జోస్యం చెప్పారు. గెలుపు సమిష్టి విజయంగా భావిస్తామని.. పీసీసీ చీఫ్‌గా తనకు కూడా క్రెడిట్ ఉంటుందన్నారు.
రైతుబంధుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని.. నవంబర్ 15లోగా రైతుబంధు ఇవ్వాలని కోరామని తెలిపారు. రైతుబంధు ఆపడం వెనుక తమ పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆపారని దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతుబంధు ఆగిందంటూ కామెంట్స్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ విధానమని.. వ్యవసాయానికి, పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 3 గంటల విద్యుత్ అంటూ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..