Telangana Election: శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు.. స్వల్ప తేడాతో విజయం సాధించిన ఎమ్మెల్యే వీరే..!

|

Nov 14, 2023 | 11:24 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది పాలిటిక్స్ రోజురోజుకీ మరింత హీటెక్కుతున్నాయి. పార్టీ నేతల ప్రచారాలతో వీధులన్ని మార్మోగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వెళ్ళి ఓటమి చవిచూసిన నేతలు ఉన్నారు. రెప్పుపాటులో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టిన వారు ఉన్నారు. దీంతో ఎక్కడ పొరపాటు జరిగిందో లెక్కలేసుకుంటూ ఐదేళ్లపాటు తలచుకుంటూ కుమిలిపోయిన నేతలు లేకపోలేరు.

Telangana Election: శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు.. స్వల్ప తేడాతో విజయం సాధించిన ఎమ్మెల్యే వీరే..!
Election Poll
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది పాలిటిక్స్ రోజురోజుకీ మరింత హీటెక్కుతున్నాయి. పార్టీ నేతల ప్రచారాలతో వీధులన్ని మార్మోగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వెళ్ళి ఓటమి చవిచూసిన నేతలు ఉన్నారు. రెప్పుపాటులో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టిన వారు ఉన్నారు. దీంతో ఎక్కడ పొరపాటు జరిగిందో లెక్కలేసుకుంటూ ఐదేళ్లపాటు తలచుకుంటూ కుమిలిపోయిన నేతలు లేకపోలేరు.

అలాంటి హోరాహోరీ పోరు హైదరాబాద్ మహనగరంలోనూ చోటుచేసుకున్నాయి. వందల సంఖ్య ఓట్ల తేడాతోనే గెలుపొందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. విజయం అంచులా దాకా వెళ్లి వచ్చిన నేతలు తర్వాతి సందర్భాల్లో తమ పొరపాట్లను సరిదిద్దుకుని విజయ కేతనం ఎగరేశారు. భాగ్యనగరంలో ఉత్కంఠ పోరు జరిగిన సందర్భాలను ఒకసారి పరిశీలిద్దాం..

1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరఫున అప్పటి హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన సి.క్రిష్ణా యాదవ్‌ 0.1శాతం తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 88,245 ఓట్లు రాగా.. సమీప బీజేపీ ఆలె నరేంద్రపై ప్రత్యర్థిపై కేవలం 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో క్రిష్టా యాదవ్ బీజేపీ తరుఫున అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక 1994 ఎన్నికల్లో మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పి.నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎం.ముఖేశ్‌ గౌడ్‌పై

1978 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 978 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పి.జనార్దన్‌రెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగన అలె నరేంద్రపై 654 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసిన బి.మచ్ఛేంద్రరావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ముత్తుస్వామిపై 366 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మహారాజ్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన శివ పర్షాద్‌ తన సమీప జనతా పార్టీ అభ్యర్థి బద్రి విశాల్‌ పిట్టిపై 266 ఓట్ల తేడాలో విజయం సాధించారు.

ఇదిలావుంటే 1983లో ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ అభ్యర్తి శ్రీపతి రాజేశ్వర్‌ తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన నాయినీ నర్సింహారెడ్డిపై 307 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983 ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఉమా వెంకట్రామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయ్యిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి టి.పి.రెడ్డిపై 64 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇక, 2004 ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున బరిలో దిగిన నాయినీ నర్సింహారెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి కె.లక్ష్మణ్‌పై కేవలం 240 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై 376 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చూశారు ఎన్నికల సమయం ఎంత చిత్ర విచిత్రాలు జరుగుతాయో.. కొద్దిపాటి ఓట్ల తేడాతోనే అభ్యర్థులు ఓటమిపాలై, జరిగిన తప్పులను సరిద్దిదుకుంటూ తదుపరి ఎన్నికల్లో విజయం సాధించిన నేతలు లేకపోలేరు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…