Telangana Election: బీజేపీ రెండో జాబితా విడుదల.. పూర్తిస్థాయి లిస్టుపై కొనసాగుతునన కసరత్తు
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించింది బీజేపీ.
తెలంగాణ ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర నాయకుల గుండె చప్పుడు పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించింది బీజేపీ. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది కాషాయ దళ అధిష్టానం. ఈ పేరుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే పూర్తి స్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది.
బీజేపీ ఎన్నికల మొదటి జాబితా ఇటీవలనే విడుదల చేసిందిద. ఫస్ట్‌లిస్టులో మొత్తం 55 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇందులో పాల్గొన్నారు.
ఎన్నికల బరిలోకి దిగేందుకు కేంద్ర కమిటీ 50మందికిపైగా అభ్యర్ధులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేసిన ఎన్నికల కమిటీ రెండో జాబితాలో ఒకే ఒక పేరును ప్రకటించింది. వరుస భేటీలు.. వడపోతలు.. అంతకుమించి సుదీర్ఘ కసరత్తు.. వీటన్నింటి తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తుంది. బలాలు, బ్యాగ్రౌండ్, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…