Basara IIIT: ‘మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది’.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి సబితా రెడ్డి లేఖ..

|

Jun 18, 2022 | 5:41 PM

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తూనే..

Basara IIIT: మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి సబితా రెడ్డి లేఖ..
Sabiha Indra Reddy
Follow us on

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 12 డిమాండ్లను నెరవేర్చాలంటూ వేల మంది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక విద్యార్థులకు మద్ధతుగా రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ఎలాగైనా ఈ నిరసనలకు ఫుల్ స్టాప్‌ పెట్టేందుకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా విద్యార్థులను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో విద్యార్థులను ఉద్దేశించి సబితా కొన్ని అంశాలను ప్రస్తావించారు. దయచేసి ఆందోళన విరమించండని, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించామని చెప్పి మంత్రి.. ప్రభుత్వం పంపించిన ఉన్నత విద్యామండలి వైస్‌-ఛైర్మన్‌ వెంకటరమణతో చర్చించండని సూచించారు. విద్యార్థుల సమస్యను తక్కువచేయటం తన ఉద్దేశం కాదని పేర్కొ్న్న మంత్రి ఆందోళన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక అమ్మగా బాధేస్తుంది..

కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి ప్రత్యక్షంగా తరగతులు సాగక, చిన్న చిన్న అంశాలను పరిష్కరించడంతో జాప్యం జరిగి ఉండొచ్చన్న మంత్రి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ‘గత కొన్ని రోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు, ఒక అమ్మగా బాధేస్తుంది. ‘ఇది మీ ప్రభుత్వం’ దయచేసి చర్చించండి. ఆందోళనను విరమించండి. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది’ అంటూ మంత్రి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..