AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ భూకంపం వచ్చే అవకాశం..?

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది.

Telangana: బీ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ భూకంపం వచ్చే అవకాశం..?
Earthquake
Balaraju Goud
|

Updated on: Apr 11, 2025 | 2:22 PM

Share

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.

అయితే డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. అయితే తెలంగాణ ప్రాంతం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2లో ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉండటం వల్ల.. అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. గతంలోనూ ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా అవి నష్టం కలిగించలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక చేస్తూ ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే, 1969లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1998లో తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో 4.5 తీవ్రతతో భూంకంపం వచ్చింది. 1984, 1999, 2013లలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవించాయి. భూకంపాల రాకను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని, కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు. అయితే, అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ