Big Breaking: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..

|

Jun 21, 2021 | 6:21 PM

Telangana Eamcet Schedule: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ తేదీల షెడ్యూల్ ఖరారైంది. ఆగష్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్....

Big Breaking: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..
Follow us on

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ తేదీల షెడ్యూల్ ఖరారైంది. ఆగష్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్&మెడికల్) పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటనను రిలీజ్ చేశారు. ఆగష్టు 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను, ఆగష్టు 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్&మెడికల్ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఆగష్టు 3న ఈసెట్, ఆగష్టు 11-14 మధ్య పీఈసెట్ ప్రవేశ పరీక్షలను జరుపుతామన్నారు. ఆగష్టు 19,20 తేదీల్లో ఐసెట్, ఆగష్టు 23న లాసెట్, ఆగష్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్, అలాగే జూలై 17వ తేదీన పాలీసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు ఎదురుకాకుండా పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఫైనల్ ఇయర్ పరీక్షలు జూలైలో పూర్తి…

మరోవైపు ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జూలై చివరి వారంలోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధుల బ్యాక్‌లాగ్‌లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

కాగా, రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను రీ-ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించి.. 8 నుంచి ఆపై తరగతుల విద్యార్ధులకు నేరుగా క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!