TS Eamcet 2023 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి..

|

May 26, 2023 | 1:28 PM

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు ఈ రోజు (మే 25) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ర్మన్‌ ఆచార్య లింబాద్రి..

TS Eamcet 2023 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి..
TS Eamcet 2023

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు ఈ రోజు (మే 25) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహారెడ్డి ప్రకటించారు. తొలుత ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని అధికారులు మంగళవారం ప్రకటించినప్పటికీ.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయంలో మార్పు చేసినట్లు వారు తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ www.eamcet.tsche.ac.in, https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరిగాయి. దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,01,789 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ (అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌) ప్రాథమిక కీలు మే 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ కూడా విడుదలకానుంది. ఫలితాల ప్రకటన అనంతరం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తారు. ర్యాంకులు సాధించిన వారు ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనవల్సి ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 May 2023 10:41 AM (IST)

    TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

  • 25 May 2023 10:27 AM (IST)

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు.. టాప్‌ 3 ర్యాంకులు వారివే

    ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ (158.89) సాధించిన అనిరుద్‌ సనపల్ల.. విశాఖపట్నంకి చెందినవాడు. సెకండ్‌ ర్యాంక్‌ (156.59)లో నిలిచిన ఎక్కంటిపాని వెంకట మనిందర్‌ రెడ్డి గుంటూరుకు చెందిన విద్యార్ధి. మూడో ర్యాంక్‌ (156.94) సాధించిన చల్లా రమేష్ కృష్ణా జిల్లా నందిగామ వాసి. టాప్‌ మూడు ర్యాంకర్లు ఆంధ్రా విద్యార్ధులు కొల్లగొట్టారు. ఇక నాల్గవ ర్యాంక్‌ సాధించిన అభినిత్ మంజేటి (156.58) తెలంగాణ కొండాపూర్‌, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ తాడిపత్రికి చెందినవాడు.

  • 25 May 2023 10:18 AM (IST)

    TS Eamcet 2023 Results: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల్లో ‘బురుగుపల్లి సత్య’కు ఫస్ట్‌ ర్యాంక్‌

    అగ్రికల్చర్‌, ఫార్మసీలో బురుగుపల్లి సత్య ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. రెండో ర్యాంక్‌ నాసిక వెంకట తేజ, మూడో ర్యాంక్‌ పఫల్‌ లక్ష్మి పసుపులేటి, నాల్గవ ర్యాంక్‌ దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి, 5వ ర్యాంకు బోర వరున్‌ చక్రవర్తి ర్యాంకులు సాధించారు.

  • 25 May 2023 10:14 AM (IST)

    రెండు మూడు రోజుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభం

    తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలు హవా చాటారు. 2,3 రోజుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.

  • 25 May 2023 10:12 AM (IST)

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ‘అనిరుద్ సనపల్ల’కు ఫస్ట్‌ ర్యాంక్‌

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో మొదటి ర్యాంక్‌ అనిరుద్ సనపల, సెకండ్‌ ర్యాంక్‌ యాకంటి పల్లి వెంకట మనిందర రెడ్డి, మూడో ర్యాంక్‌ చల్లా రమేష్, నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ సాధించారు.

  • 25 May 2023 10:09 AM (IST)

    TS Eamcet 2023 Results: ఇంజనీరింగ్‌లో 80 శాతం.. అగ్రికల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌ పర్సెంటెల్‌ వచ్చింది. వీరిలో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిలు 82 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో.. అబ్బాయిలు 84 శాతం, అమ్మాయిలు 87 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.

  • 25 May 2023 10:02 AM (IST)

    TS Eamcet 2023 Results: స్థానిక కోటా కింద రాష్ట్ర విద్యార్ధులకు 85 శాతం కోటా సీట్లు.. 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాలకు

    స్థానిక కోటా కింద రాష్ట్ర అభ్యర్ధులకు 85 శాతం కోటా ఉవ్వనున్నారు. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయించనునున్నారు. ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ర్యాంకు, కోర్సు, అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అడ్మిషన్లు ఉంటాయి.

  • 25 May 2023 09:59 AM (IST)

    TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత..94.11 శాతం మంది ఉత్తీర్ణత

    విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 94.11 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో 80 శాతం, అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 25 May 2023 09:50 AM (IST)

    TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం (మే 25) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కాసేపటి క్రితం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

  • 25 May 2023 09:37 AM (IST)

    మరికాసేపట్లో విడుదలకానున్న తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు.

    తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు ఈ రోజు (మే 25) విడుదలకానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.

Follow us on