DOST 1st Phase Seat Allotment Results: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2023-24 ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) శుక్రవారం మొదటి విడత సీట్ల కేటాయింపు చేసింది. మొదటి విడతలో దాదాపు 73,220 విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయించింది. మే 16 నుంచి జూన్ 10వ వరకు తొలివిడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగగా.. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ రోజు ఫేజ్ 1 సీట్ల కేటాయింపులో అధిక మంది విద్యార్ధులు కామర్స్ కోర్సులో అడ్మిషన్లు పొందినట్లు అధికారులు తెలిపారు. కామర్స్‌లో 33,251(45.41%) మంది, లైఫ్ సైన్సెస్‌లో 16,434 (22.44శాతం) మంది ప్రవేశాలు పొందారు. తొలివిడత ప్రవేశాల్లో అమ్మాయిలకు 44,113 సీట్లు, అబ్బాయిలకు 29,107 సీట్లు కేటాయించామని, 63 డిగ్రీ కాలేజీల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్ధి కూడా చేరలేదని దోస్త్ కన్వీనర్ తెలిపారు.
దోస్త్ ఫేజ్-2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి జూన్ 26 వరకు ఉంటుంది. జూన్ 16 నుంచి జూన్ 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 30న ఉంటుంది. జులై 1 నుంచి 6 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు జులై 10న ఉంటుంది. జులై 17 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.