Telangana Traffic Challan : వాహనదారులకు బిగ్‌ అలర్ట్..! మరికొన్ని గంటలే.. త్వరపడండి

|

Jan 10, 2024 | 1:02 PM

రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్స్ ఉండగా..నిన్నటివరకూ వరకు కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో చలాన్స్‌‌‌‌ క్లియర్ అయ్యాయి. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ఇవాళ సాయంత్రం వరకే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Telangana Traffic Challan : వాహనదారులకు బిగ్‌ అలర్ట్..! మరికొన్ని గంటలే.. త్వరపడండి
Pending Challans
Follow us on

తెలంగాణలో వాహనదారులకు బిగ్‌ అలర్ట్..! ట్రాఫిక్ మరికొన్ని  పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్‌ 26న ప్రారంభమైన ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్స్ ఉండగా..నిన్నటివరకూ వరకు కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో చలాన్స్‌‌‌‌ క్లియర్ అయ్యాయి. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ఇవాళ సాయంత్రం వరకే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎవరైనా పెండింగ్‌ చలాన్‌లను చెల్లించకపోతే..వారు వెంటనే చలాన్ చెల్లించాలనీ, మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని చెబుతున్నారు.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా, బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని..అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ చెల్లుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించింది. ఈ భారీ ఆఫర్ మరికొన్ని గంటలలో ముగియనుండటంతో వాహనదారుల ఒక్క సారిగా అలర్ట్ అయ్యారు. పెండింగ్ చలాన్లు ఉంటే మీరు కూడా వెంటనే చెల్లించండి. ఈ ఆఫర్ మిస్సయితే..తరువాత భారీ మొత్తంలో కట్టాల్సి ఉంది. సో.. బీ అలర్ట్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..