Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యాధికారులకు పలు సూచనలు

|

May 07, 2021 | 7:34 PM

Telangana CS Somesh Kumar: తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను సైతం అమలుచేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యాధికారులకు పలు సూచనలు
Somesh Kumar Visited Gandhi Hospital
Follow us on

Telangana CS Somesh Kumar: తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను సైతం అమలుచేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, కొవిడ్‌ రోగులకు అందుతున్న తదితర సేవల గురించి సోమేశ్ కుమార్ వైద్యాధికులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని, మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని సూచించారు.

దీంతోపాటు.. 160 అదనపు పడకలతో లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసిన కొత్త వార్డును కూడా సోమేష్ కుమార్ పరిశీలించారు. ఇది త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతోపాటు రోజుకు 4 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కొత్త ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఇది 400 మంది రోగులకు ఆక్సిజన్ అందించగలదు. అంతేకాకుండా పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్‌లైన్ పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, అధికారులతో సంభాషించి.. పలువురిని ప్రశంసించారు.

సీఎస్ సోమేశ్ కుమార్ వెంట.. పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ, స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ రోనాల్డ్ రోజ్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.