Mancherial: ఏమరపాటులో భార్య… భార్యను కాపాడబోయి భర్త.. క్షణాల వ్యవధిలో

|

Apr 22, 2023 | 9:49 AM

చెన్నూరు పట్టణంలోని లైన్ గడ్డ వద్ద శుక్రవారం ఉదయం విద్యుత్ ప్రవహిస్తున్న తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. బట్టలు ఆరేసే సమయంలో ఈ ప్రమాదం సంభంవించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Mancherial: ఏమరపాటులో భార్య... భార్యను కాపాడబోయి భర్త.. క్షణాల వ్యవధిలో
Srinivas - Seshidevi
Follow us on

వారిది అన్యోన్న దాంపత్యం. బాగా స్థిరపడ్డారు. పిల్లలను కూడా మంచిగా చదివిస్తున్నారు. అంతా హ్యాపీ. కానీ ఇంతలోనే అతి పెద్ద కుదుపు. భార్యభర్తలు ఇద్దరూ క్షణాల వ్యవధిలో లోకాన్ని వీడారు. ఇంటి ముందు వెలుగు కోసం పెట్టిన దీపమే వారి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే..  మంచిర్యాల జిల్లా చెన్నూరు లైన్‌గడ్డ కాలనీలో బొల్లంపల్లి శ్రీనివాస్‌(44), ఆయన భార్య శశిదేవి (38) నివాసం ఉంటున్నారు. వారికి ఇంటర్‌, టెన్త్ చదువుతున్న చరణ్‌రాజ్‌, పవన్‌తేజ్‌ తనయులున్నారు. ఉదయాన్నే లేచిన వెంటే.. రాత్రి వర్షం కారణంగా ఇంటి ముందు పేరుకుపోయిన చెత్తను శుభ్రంగా ఊడ్చారు శశిదేవి. ఈ క్రమంలోనే రాత్రి ఈదురుగాలికి తీగపై ఆరేసిన బట్టలు కింద పడటంతో.. తిరిగి వాటిని అదే తీగపై వేసే ప్రయత్నం చేశారు. ఆ తీగకు కరెంట్ పాస్ అవ్వడంతో.. షాక్ కొట్టి పక్కనే ఉన్న కారు వైపు వాలిపోయారు. గమనించిన భర్త పరుగు పరుగున వచ్చి ఆమెను కాపాడే యత్నం చేశారు. దీంతో అతడికి కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు.

ఇంటి ముందు వెలుగు వచ్చేందుకు గోడకు కరెంట్ బల్బు ఏర్పాటు చేశారు. దీపం ఉన్న గొట్టానికి, మరోవైపు ఉన్న గేటు కమ్మీకి మధ్య బట్టలు ఆరేసుకునేందుకు తీగ కట్టారు. రాత్రి కురిసిన వర్షానికి కరెంట్ బల్బు ద్వారా గొట్టానికి, దాన్నుంచి తీగకు కరెంట్ పాసయ్యింది. ఈ విషయం గ్రహించని ఆమె ఎప్పట్లానే బట్టలు ఆరేస్తూ తీగకు చెయ్యి తగిలి కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడాలనే ప్రయత్నంలో భర్త కూడా ప్రాణాలు విడిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం