Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 221 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం రిలీజ్ చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య 1,588కి చేరింది. కరోనాబారి నుంచి శుక్రవారం 431 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 2,87,899కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,569 ఉండగా వీరిలో 1973 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తెలంగాణలో కూడా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. త్వరలో ప్రజలకు సైతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.
Also Read:
కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి
తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్ జాగ్రత్త!