కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 609 పాజిటివ్‌ కేసులు, యాక్టీవ్ కేసులు సంఖ్య ఎంతంటే..?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 53,686 మందికి కరోనా నిర్థారణ టెస్టులు చేయగా 609 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య...

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 609 పాజిటివ్‌ కేసులు, యాక్టీవ్ కేసులు సంఖ్య ఎంతంటే..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2020 | 9:12 AM

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 53,686 మందికి కరోనా నిర్థారణ టెస్టులు చేయగా 609 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,71,492కి చేరింది.  బుధవారం వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైరస్ మృతుల సంఖ్య 1,465కి చేరింది. కరోనాబారి నుంచి బుధవారం 873 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,028కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,999 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 6,922 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా టెస్టుల  సంఖ్య 56,05,306కి చేరింది.

Also Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి