AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కాలే‌జీ‌ సీట్ల భర్తీ ప్రక్రియ.. ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌..

తెలంగాణలో ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారం‌భం‌కా‌ను‌న్నది. ఎంబీఏ, ఎంసీఏ కాలే‌జీ‌ల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి 11 వరకు సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌లన స్లాట్‌ బుకింగ్‌ కోసం గడువు విధించారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కాలే‌జీ‌ సీట్ల భర్తీ ప్రక్రియ..  ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌..
Balaraju Goud
|

Updated on: Dec 03, 2020 | 9:08 AM

Share

తెలంగాణలో ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారం‌భం‌కా‌ను‌న్నది. ఎంబీఏ, ఎంసీఏ కాలే‌జీ‌ల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి 11 వరకు సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌లన స్లాట్‌ బుకింగ్‌ కోసం గడువు విధించారు. 8 నుంచి 12వ తేదీ‌వ‌రకు విద్యార్థుల సర్టి‌ఫి‌కేట్లను పరి‌శీ‌లి‌స్తారు. 8 నుంచి 13 వ‌రకు సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌ల‌నకు హాజ‌ర‌య్యే‌వా‌రికి వెబ్‌ కౌన్సె‌లిం‌గ్‌లో పాల్గొ‌న‌డా‌నికి అవ‌కాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన మొదటి విడుత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు.

ఈనెల 22 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభమవనుంది. డిసెంబర్‌ 22న స్లాట్‌ బుకింగ్‌, 23న సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినవారు 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈనెల 26న చివరి విడుత కౌన్సిలింగ్ పూర్తయ్యాక విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన సీట్లకు ఈనెల 28న స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించి విదివిధా నాలను ప్రకటించాల్సి ఉంది.

కాగా, ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తికావాల్సి ఉన్నది. అయితే గత నెలలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో కూడా ఎన్నికల పోలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపటితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండటంతో తాజాగా ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

Follow Us
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్