Telangana Corona: తెలంగాణలో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. పదివేలకు వరకు నమోదైన పాజిటివ్ కేసులు.. లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య..
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. పదివేలకు వరకు నమోదైన పాజిటివ్ కేసులు.. లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2242 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా 19 మంది మృతి చెందినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 3,125కు చేరింది. తాజాగా రికవరీ కేసుల సంఖ్య 4693 ఉండగా, ఇప్పటి వరకు 5,09,663 రికవరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.