Telangana Corona Update: రాష్ట్రంలో కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో 56 మంది మృతి..

|

May 02, 2021 | 10:19 AM

TS Corona Update : కరోనా రెండో దశ యావత్ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం ప్రశాంతగా కనిపించే స్మశానాలు సైతం కరోనా డెడ్ బాడీలతో ఇప్పుడు రద్దీగా మారిపోయాయి.

Telangana Corona Update: రాష్ట్రంలో కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో 56 మంది మృతి..
Ts Corona Update
Follow us on

TS Corona Update : కరోనా రెండో దశ యావత్ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం ప్రశాంతగా కనిపించే స్మశానాలు సైతం కరోనా డెడ్ బాడీలతో ఇప్పుడు రద్దీగా మారిపోయాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు పటిష్టంగా చేపట్టిన.. ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు. మాస్క్ ధరించకపోవడం.. సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 76,330 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,368కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక తెలిపింది. జీహెచ్ ఎంసీ పరిధిలో మరో 1546 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,30,60,114కి చేరింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3673 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,49,943కు చేరగా, మృతులు 2,15,454కు పెరిగారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,07,865 మంది కోలుకోగా, ఇప్పటి వరకు దేశంలో 1.59 కోట్ల మంది కోవిడ్‌ను జయించారు. ఇక రికవరీ రేటు 81.77 శాతం ఉంది.

Also Read: PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‏న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు

Google: కరోనాతో ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా గూగుల్‌ సంస్థకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?