Telangana Corona Bulletin: తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. ఒక్క రోజులో 417 కేసులు నమోదు.. ఇద్దరు మృతి..
Telangana Corona Bulletin: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది.
Telangana Corona Bulletin: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 417 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనాతో ఇద్దరు చనిపోగా.. 472 మంది బాధితులు కరోనాను జయించారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,88,410 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా మృతుల సంఖ్య 1,556కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,982 యాక్టీవ్ కేసులు ఉండగా, వీరిలో 2,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం ఒక్క రోజే 82 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేట్ 97.73శాతం ఉండగా, డెత్ రేటు 0.53శాతంగా ఉంది.
Also read:
Silver Rate Today : పరుగులు పెడుతున్న వెండి.. భారీగా పెరిగిన ధర.. కిలోకి రూ. 400 పెరుగుదల..
Petrol-Diesel Price Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. బుధవారం కూడా..