OU Exam Fee: విద్యార్థులూ బీ అలెర్ట్.. డిగ్రీ పరీక్ష ఫీజు గడవును ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ..
OU Exam Fee: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల విద్యార్థులు అలెర్ట్ అవ్వండి. అన్ని రకాల డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపునకు
OU Exam Fee: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల విద్యార్థులు అలెర్ట్ అవ్వండి. అన్ని రకాల డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును ఓయూ అధికారులు ప్రకటించారు. ఈనెల 30వ తేదీ లోపు పరీక్ష ఫీజును చెల్లించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే డిగ్రీ మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాల రీవాల్యుయేషన్ ఫీజును ఈనెల 18వ తేదీ వరకు చెల్లించాలని సంబంధిత ప్రకనటలో పేర్కొన్నారు.
ఇక జవాబు పత్రాల కాపీ కావాలనుకునేవారు ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. మరోవైపు ఓయూ లా కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం 040-27682368, 23231092 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు.
Also read:
Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు..
రామతీర్థయాత్ర అరెస్టుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు, నందికొట్కూరులో బీజేపీ నేతల అరెస్టులు