Silver Rate Today : పరుగులు పెడుతున్న వెండి.. భారీగా పెరిగిన ధర.. కిలోకి రూ. 400 పెరుగుదల..
బంగారంతో పాటు వెండి దార కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటికే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే.. వెండి కూడా ఇదే బాటలో నడిచింది. కిలో వెండి ధర రూ. 400 పెరిగి
Silver Rate Today : బంగారంతో పాటు వెండి ధర కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటికే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే.. వెండి కూడా ఇదే బాటలో నడిచింది. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 74, 500 కి చేరింది. గత కొద్దిరోజులుగా వెండి ధర తగ్గుతూ..పెరుగుతూ వస్తుంది. నేడు ఏకంగా రూ. 400 పెరిగింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి…
దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.702 గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.702గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 740, బెంగళూరులో తులం రూ.702గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 74,500గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.740గా నమోదైంది.