Petrol-Diesel Price Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. బుధవారం కూడా..
Petrol-Diesel Price Remains Same: గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. తాజాగా బుధవారం కూడా...
Petrol-Diesel Price Remains Same: గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. తాజాగా బుధవారం కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వరుసగా 29 రోజుల పాటు పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పు లేకపోవడం విశేషం.
తాజాగా హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 87.34 ఉండగా, డీజిల్ ధర. 80.88 నమోదైంది. ఇక ఆంధప్రదేశ్ విషయానికొస్తే.. అమరావతిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.89.92 వద్దనే ఉండగా. డీజిల్ ధర రూ.82.98 వద్ద నిలకడగా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.89.44 ఉండగా.. డీజిల్ ధర రూ.82.54 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే.. పెట్రోల్ లీటర్ ధర రూ. 83.71 ఉండగా, డీజిల్ ధర రూ.73.87 వద్ద స్థిరంగా ఉంది. దేశ ఫైనెన్షియల్ క్యాపిటల్ ముంబైలో పెట్రోల్ ధర రూ.90.34 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.80.51గా ఉంది.
Also Read: Twitter Acquires Breaker : బ్రేకర్‌ను ఎగురేసుకుపోయిన ట్విట్టర్ పిట్ట.. ఎలా అన్నదే ఇక్కడ ట్విస్ట్..