Twitter Acquires Breaker : బ్రేకర్‌ను ఎగురేసుకుపోయిన ట్విట్టర్ పిట్ట.. ఎలా అన్నదే ఇక్కడ ట్విస్ట్..

ట్విట్టర్ పిట్ట గొంతు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యాప్‌ బ్రేకర్‌ ట్విటర్‌ చేతికి వెళ్లిపోతోంది. త్వరలోనే దీనిని ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు  ఏర్పాట్లు పూర్తయ్యాయి.  బ్రేకర్‌ను మూసివేస్తున్నట్లుగా ఆ సంస్థ సీఈఓ ఎరిక్‌ బెర్లి ట్విట్టర్...

Twitter Acquires Breaker : బ్రేకర్‌ను ఎగురేసుకుపోయిన ట్విట్టర్ పిట్ట.. ఎలా అన్నదే ఇక్కడ ట్విస్ట్..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 9:20 PM

Twitter Acquires Breaker : ట్విట్టర్ పిట్ట గొంతు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యాప్‌ బ్రేకర్‌ ట్విటర్‌ చేతికి వెళ్లిపోతోంది. త్వరలోనే దీనిని ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు  ఏర్పాట్లు పూర్తయ్యాయి.  బ్రేకర్‌ను మూసివేస్తున్నట్లుగా ఆ సంస్థ సీఈఓ ఎరిక్‌ బెర్లి ట్విట్టర్ ద్వారా తెలిపారు. వచ్చే వారం నుంచి బ్రేకర్ అందుబాటులో ఉండదని రాసుకొచ్చారు. బ్రేకర్ వినియోగదారులకు విషాదకరమైన వార్త అంటూ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి బ్రేకర్‌ను మూసివేస్తున్నాం.

భవిష్యత్తులో తీసుకురానున్న వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నాం అని తెలిపారు. బ్రేకర్‌లో ఆడియో కమ్యూనికేషన్‌పై చాలా శ్రద్ధపెట్టినట్లుగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భావాలను తెలిపేందుకు ట్విటర్‌ అందించిన వేదికను చూసి స్ఫూర్తి పొందామని పేర్కొన్నారు. ఎరిక్‌ బెర్లితో కలిసి పనిచేసిన టీమ్ మొత్తం ట్విటర్‌లో చేరిపోయారు. ఇప్పటికే యాప్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకొన్న వారి సబ్‌స్క్రిప్షన్లను ఇతర పాడ్‌కాస్టింగ్‌ యాప్‌లకు బదిలీ చేయనున్నారు. వీటిల్లో యాపిల్‌ ఐఎన్‌ఎసీ, స్పోటిఫై వంటివి ఉండనున్నాయి. ఇదిలావుంటే.. బ్రేకర్‌ను ఎంతకు కొనుగోలు చేసిందో ట్విట్టర్ చెప్పలేదు.