Telangana congress senior leader V H Hanumanta rao PC : మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. “కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చా లేదు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీ ని పంపించారు. ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా..?” అని విహెచ్ సంశయం వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ లో ఉత్తమ్ , భట్టి వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందని విహెచ్ ఆరోపించారు.
“నేను కాంగ్రెస్ మనిషిని.. నేను ఫోన్లు చేస్తే కూడా లిప్ట్ చేయడు. ఫోన్లు కొందరికే చేసి నిర్ణయిస్తారా.. ఇంత సీనియర్ అయినా నాకు ఫోన్ రాలేదు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నా.. సమీక్ష చేసే నాయకుడే లేరు.” అని హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడి విషయంలో పరిశీలకుడు వచ్చి వెళ్లాకే ప్రకటన చేయాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ను హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి పీసీసీ నిర్ణయిస్తే.. ‘పార్టీ లో ఎవరు ఉంటరో లేదో తెలియని పరిస్థితి’ ఇక్కడ ఉందని విహెచ్ అన్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.
Read also : Bandi Sanjay : ఈటలకు బండి సంజయ్ ఘన స్వాగతం.. ముఖ్యమంత్రి అందుకే మళ్లీ ప్రజల వద్దకు తిరుగుతున్నారని వ్యాఖ్య