Revanth Reddy: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం.. కారణం ఏంటంటే..!

|

Aug 13, 2022 | 12:47 PM

Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో..

Revanth Reddy: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం.. కారణం ఏంటంటే..!
Revanth Reddy
Follow us on

Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వివిధ పార్టీల నేతలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా పాదయాత్ర చేపట్టబోతోంది. కొద్దిసేపట్లో మునుగోడు నియోజకవర్గంలో జరిగే పాదయాత్రకు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా, కరోనా పాజిటివ్‌ కారణంగా దూరంగా ఉండనున్నారు. ఆజాదీ కా గౌరవ్‌ పేరుతో యాత్ర చేస్తున్నా ఉప ఎన్నిక రాజకీయంలో ఇది ఆసక్తిగా మారింది. ఈ పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరమయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన పాదయాత్రకు వెళ్లడం లేదు. రేవంత్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

కాగా, మరో వైపు అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంతగూటిలోనే లుకలుకలు మొదలయ్యాయి. అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అలాగే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కూడా వెంకట్‌రెడ్డి మండిపడగా, తాజాగా రేవంత్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన క్షమాపణలను లైట్‌గా తీసుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, అప్పుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందిస్తానని పేర్కొన్నారు. చివరకు అద్దంకి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పినా.. వెంకట్‌రెడ్డి మాత్రం తగ్గేదిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని పాలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి