Telangana Congress: మా వాటా మాకివ్వండి.. అధిష్టానాన్ని నిలదీస్తున్న టీ-కాంగ్రెస్‌లో ఓబీసీ నేతలు..

Tickets to BCs: ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం అర్హత ఉన్న ఓబీసీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంలో TPCC మీనమేషాలు లెక్కిస్తోందన్నది టీ-కాంగ్రెస్‌లో ఓబీసీ నేతల ఆరోపణ. జనాభా ప్రాతిపదికన తమకు కనీసం 45 సీట్లు కేటాయించాలన్నది కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఓబీసీ నేతలు అడుగుతున్నారు. ఇదిలావుంటే, హైదరాబాద్‌లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. హైదరాబాద్‌లో బీసీ అభ్యర్థులకు కాంగ్రెస్ ఐదు సీట్లు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

Telangana Congress: మా వాటా మాకివ్వండి.. అధిష్టానాన్ని నిలదీస్తున్న టీ-కాంగ్రెస్‌లో ఓబీసీ నేతలు..
Gandhi Bhavan

Updated on: Sep 24, 2023 | 5:06 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణా కాంగ్రెస్‌లో ఓబీసీ నేతలు ఉనికి కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఓబీసీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఇవాళ గాంధీభవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీనియర్ ఓబీసీ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెత్కర్, పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్నారు. మిగతా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

పార్టీ కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ఓబీసీ నేతలు. రాబోయే ఎన్నికల్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఉంటుందని స్వయంగా రాహుల్ గాంధీయే చెప్పినా.. ఫలితం లేదంటున్నారు. ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న చింతన్ శిబిర్ నిర్ణయాల్ని ఎందుకు తుంగలో తొక్కుతారు అని నిలదీస్తున్నారు.

ఓబీసీ నేతల చివరి ప్రయత్నం..

ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం అర్హత ఉన్న ఓబీసీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంలో టీపీసీసీ మీనమేషాలు లెక్కిస్తోందన్నది వీళ్ల ఆరోపణ. జనాభా ప్రాతిపదికన తమకు కనీసం 45 సీట్లు కేటాయించాలన్నది కాంగ్రెస్‌ అధిష్టానానికి ఓబీసీ నేతల చివరి ప్రయత్నం. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా.. పలు లోక్‌సభ సెగ్మెంట్లలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

“పారాచూట్” నాయకుల..

గతంలో ఖమ్మం జిల్లాలో కేవలం మూడు ఓపెన్ కేటగిరీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మూడు సెగ్మెంట్లలో రెండు సెగ్మెంట్లలో రెడ్డి, కమ్మ “పారాచూట్” నాయకుల అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిగణించింది. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ చర్చల్లో ఆధిపత్యం ఉన్న రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా, గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో శాసన సభలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ BC నాయకులను స్క్రీనింగ్ కమిటీ విస్మరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్న మొదటి జాబితాలో ఆశించిన సంఖ్యలో బీసీ నాయకులకు అవకాశం ఇవ్వాలని వీరు కొరనున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఐదు సీట్లు..

హైదరాబాద్‌లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. హైదరాబాద్‌లో బీసీ అభ్యర్థులకు కాంగ్రెస్ ఐదు సీట్లు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలకు 34 సీట్లు ఖచ్చితంగా దక్కవని ఓ సీనియర్‌ నేత అన్నట్లుగా సమాచారం. అయితే బీసీలకు ఇప్పటికే 24 సీట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని మాత్రం ఆయన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..