TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్మధనం.. ఈటల విషయంలో ఎక్కడ తప్పు జరిగింది చెప్మా..? అంటున్న లీడర్లు

|

May 27, 2021 | 2:03 PM

తెలంగాణ పాలిటిక్స్ మళ్లీ హీట్ ఎక్కుతున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న హుజురాబాద్ ఇష్యూ.. మళ్లీ పొలిటికల్ పార్టీలలో అలజడి రేపుతోంది. అధికార టీ.ఆర్.ఎస్ పార్టీలో రగిలిన వివాదాన్ని.. ప్రతిపక్ష కాంగ్రెస్...

TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్మధనం.. ఈటల విషయంలో ఎక్కడ తప్పు జరిగింది చెప్మా..? అంటున్న లీడర్లు
Follow us on

TELANGANA CONGRESS LEADERS UNDER INTROSPECTION: తెలంగాణ పాలిటిక్స్  (TELANGANA POLITICS)మళ్లీ హీట్ ఎక్కుతున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న హుజురాబాద్ (HUZURABAD) ఇష్యూ.. మళ్లీ పొలిటికల్ పార్టీలలో అలజడి రేపుతోంది. అధికార టీ.ఆర్.ఎస్ పార్టీ (TRS PARTY)లో రగిలిన వివాదాన్ని.. ప్రతిపక్ష కాంగ్రెస్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల (EETALA) .. కాంగ్రెస్ వైపు కాకుండా బిజెపి (BJP) వైపు చూస్తుండటం హస్తం నేతలను షాక్‌కు గురిచేసింది. దీంతో జరుగుతున్న పరిణామాలపై ఎలా అడుగులు వేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో మేధోమదనం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. అధికార టీ.ఆర్.ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. ఆపరేషన్ ఈటెల రాజేందర్ (EETALA RAJENDAR) ఎపిసోడ్‌తో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఈ అంశంపై అధికార టీ.ఆర్.ఎస్ లో సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. పరిస్థితులను చూస్తుంటే త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తుంది. నిజంగానే హుజురాబాద్‌కు ఉప ఎన్నిక (HUZURABAD BY-ELECTION) వస్తే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది.

మాజీమంత్రి ఈటల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈటల విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) కఠినంగా వ్యవహరించడాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈటలను వెనకేసుకొచ్చేలా బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఇన్ డైరెక్ట్‌గా మద్దతు ఇచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇక మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈటల తీరుపై బహిరంగంగా మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి (PADI KOUSHIK REDDY).. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈటల అవకతవకలపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈటలకు మద్దతు ఇవ్వవద్దని.. పార్టీ సీనియర్లను వేడుకుంటున్నారు. అంతే కొందరు ముఖ్యమైన నేతల ఇళ్లకు వెళ్లి .. ఈటలకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఈటల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఖరారు కాకముందే ఆయన బిజెపి గూటికి చేరుకుంటారన్న వార్తలు కాంగ్రెస్ నేతలకు షాకిచ్చాయి. బిజెపిలో చేరితే కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు గల్లంతు కావడంతోపాటు కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని ఆ పరిణామం ఖరారుచేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. అందువల్లే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి (KONDA VISHVESHWAR REDDY), ప్రొ. కోదండరామిరెడ్డి (PROF. KODANDARAMIREDDY)లను ఈటల వద్దకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల హామీతో వారిద్దరు ఈటలను కలిసారని చెప్పుకుంటున్నారు. ఈటెల రాజేందర్ బిజెపివైపు వెళ్ళకుండా కట్టడి చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తనను కలిసిన కోదండరామ్, విశ్వేశ్వర్ రెడ్డిలతో ఈటల టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్ గురించి ఆయనేమీ మాట్లాడలేదని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలోను హామీ ఇవ్వలేదని సమాచారం. తనను కేసులతో వేధించేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం (TRS HIGH COMMAND) ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం వుండదని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే కేంద్ర ప్రభుత్వం అండాదండా వుంటాయని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇండిపెండెంటుగా గెలిచిన తర్వాతనే ఏ పార్టీలో చేరాలనే విషయంపై దృష్టి సారించాలని ఈటల ముందుగా భావించారు. కానీ తమ పార్టీలో చేరితేనే తాము పూర్తి అండగా వుండగలమని బీజేపీ నేతలు (BJP LEADERS) చెప్పడంతో ఈటల తుది నిర్ణయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

ALSO READ: అమెరికాతో భారత్ బంధం… మెరుగుదల దిశగా అడుగులు.. జయశంకర్ పర్యటన లక్ష్యమేంటంటే?