Telangana Congress: కాంగ్రెస్‌లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. కోదండరామ్‌కు సపోర్ట్ చేయడంపై నేతల కీలక వ్యాఖ్యలు..

|

Jan 13, 2021 | 10:17 PM

Telangana Congress: త్వరలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న..

Telangana Congress: కాంగ్రెస్‌లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. కోదండరామ్‌కు సపోర్ట్ చేయడంపై నేతల కీలక వ్యాఖ్యలు..
Follow us on

Telangana Congress: త్వరలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికై తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఇదే అంశంపై పార్టీ కార్యాలయంలో కీలక నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు తెలిపారు. పార్టీలో ఎంత గొడవ జరిగినా.. టికెట్‌ను ఎంత మంది ఆశించినా చివరికి అధిష్టానం నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చదువుకున్న వాళ్లు, అర్హులైన నేతలు చాలామందే ఉన్నారన్న ఆయన.. ఇతర పార్టీలకు చెందిన వారు తమకు అవసరం లేదన్నారు. సరైన టైమ్‌లో సరైన నిర్ణయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో టీజేఎస్ నేత కోదండరాం వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడంపై పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. గతంలో తన సీట్‌నే అడిగిన కోదండరాం.. ఇప్పుడు ఎమ్మెల్సీ అడగటంలో ఆశ్చర్యం ఏముందని వ్యాఖ్యానించారు. 0.6 శాతం ఓట్లు ఉన్న ఆ పార్టీ గురించి తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులు అనివార్యంగా ఉంటాయి కానీ.. దానిలో గెలుపు ఓటములు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. గెలిచే అవకాశం కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నందున సహజంగానే టికెట్‌ కోసం పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఏది ఏమైనా అధిష్టానానిదే తుది నిర్ణయం అని పొన్నాల స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీలో బలమైన అభ్యర్థులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు పేర్కొన్నారు. ఇతర పార్టీల వారి అవసరం తమకు ఇప్పుడు లేదన్నారు. గతంలో పొత్తు పెట్టుకొని నష్టపోయామని, ఇప్పుడు అలాంటి తప్పు చేయబోమన్నారు. అన్ని కులాల నుంచి చదువుకున్న వారు తమ పార్టీలో ఉన్నారని చెప్పుకొచ్చిన వీహెచ్.. తమ పార్టీలో ఉన్నవారే పోటీ చేస్తే పార్టీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also read:

Asaduddin Owaisi: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై సంచలన ఆరోపణలు చేసిన అసదుద్దిన్ ఓవైసీ.. 12సార్లు తనను..

రామతీర్థ పోరుకు నలుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్, సత్వర న్యాయంకోసం బీజేపీతో కలిసి పోరుబాట