Telangana Congress: ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ డిక్లరేషన్.. కేసీఆర్‌పై ఖర్గే విమర్శలు..

|

Aug 26, 2023 | 8:46 PM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే అని, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందని ఆరోపించారు ఖర్గే. వాళ్లిద్దరూ రహస్య మిత్రులేనని ఫైర్ అయ్యారు. చెవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఖర్గే హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని ధ్వజమెత్తారు. మోదీని గద్దె దించాలని సెక్యులర్ పార్టీలన్నీ ఏకమయ్యాయని, కేసీఆర్‌ మాత్రం ఒక్క సమావేశానికి కూడా రాలేదన్నారు ఖర్గే. సెక్యూలర్‌ పార్టీ అని చెప్పుకునే..

Telangana Congress: ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ డిక్లరేషన్.. కేసీఆర్‌పై ఖర్గే విమర్శలు..
Telangana Congress Public Meeting
Follow us on

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే అని, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందని ఆరోపించారు ఖర్గే. వాళ్లిద్దరూ రహస్య మిత్రులేనని ఫైర్ అయ్యారు. చెవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఖర్గే హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని ధ్వజమెత్తారు. మోదీని గద్దె దించాలని సెక్యులర్ పార్టీలన్నీ ఏకమయ్యాయని, కేసీఆర్‌ మాత్రం ఒక్క సమావేశానికి కూడా రాలేదన్నారు ఖర్గే. సెక్యూలర్‌ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్‌, మోదీని గద్దె దించేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు రావడంలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ సపోర్ట్‌గా ఉన్న కేసీఆర్‌ను తెలంగాణలో గద్దె దించాలని పిలపునిచ్చారు ఖర్గే.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించిన టీ కాంగ్రెస్‌..

చేవెళ్ల బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 డిక్లరేషన్స్‌ని ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. ఎస్సీ 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్ నిర్ణయం. మాదిగలు కోరుతున్న A, B, C, D వర్గీకరణకు కూడా ఓకే.

ఇవి కూడా చదవండి

2. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఆర్థిక సాయం.

3. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% కేటాయింపు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకునే ప్రైవేటు కంపెనీల్లోనూ రిజర్వేషన్లు.

4. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లస్థలాలు, నిర్మాణం కోసం రూ.6 లక్షలు.

5. ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్‌ ల్యాండ్‌లకు యాజమాన్య హక్కులు.

6. ఎస్టీలకు పోడుపట్టాల పంపిణీ, యాజమాన్య హక్కులు.

7. ప్రతి తండా అభివృద్ధి కోసం ఏటా రూ. 25 లక్షల నిధులు.

8. ఎస్సీలకు 3 కార్పోరేషన్లు, ఏటా ప్రతి కార్పోరేషన్‌కి రూ.750 కోట్ల నిధులు.

9. ఎస్టీలకు 3 కార్పోరేషన్లు, ఏటా ప్రతీ కార్పోరేషన్‌కి రూ.500 కోట్ల నిధులు.

10. కొత్తగా 5 ITDAలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.

11. విద్యాజ్యోతుల పథకం: పదోతరగతి పూర్తయితే రూ.10 వేల నగదు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు సాయం, పీజీ పూర్తి చేస్తే రూ. లక్ష సాయం, పీహెచ్‌డీ, ఎంఫిల్ చేస్తే రూ.5 లక్షలు సాయం.

12. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటు. విదేశీ విద్య అభ్యసించేవాళ్లకు ఆర్థిక సాయం.

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ లైవ్‌ను కింది వీడియోలో చూడొచ్చు..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..