CM Revanth Reddy: దసరా సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!
తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వచ్చారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఆయన ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు దసరా పండుగ జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ముఖ్యమంత్రి రూ.21 కోట్ల 39 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు.
తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వచ్చారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఆయన ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు దసరా పండుగ జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ముఖ్యమంత్రి రూ.21 కోట్ల 39 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయితీ భవన ఆవరణలో మొక్కను నాటారు. ఆ తర్వాత ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
పలు అభివృద్ది పనులకు సీఎం భూమిపూజ:
రూ.72 లక్షల వ్యయంతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం పునరుద్ధరణ, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. అలాగే రూ.55 లక్షల వ్యయం తో చేపట్టిన యాదయ్య స్మారక లైబ్రరీ భవనం బ్యాలెన్స్ నిర్మాణ పనులు, రూ.19 లక్షల వ్యయంతో రైతు వేదిక పునరుద్ధరణ పనులు, రూ.45 లక్షల వ్యయంతో వెటర్నరీ హాస్పిటల్ భవనం తదితర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు. నివాసంలో కుటుంబసభ్యులు, బంధువులతో కొన్ని గంటల పాటు గడిపారు. సాయంత్రం నివాసం నుంచి గ్రామ శివారులోని జమ్మి చెట్టు వద్దకు ర్యాలీగా వెళ్ళారు.అనంతరం మనవడితో కలిసి జమ్మి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆంజనేయ స్వామి ఆలయంలో మరోసారి పూజలు నిర్వహించారు. అనంతరం సీఎంను గ్రామస్తులు కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులను పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు.