Telangana CM KCR: ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. విద్యార్థులకు అండగా నిలుస్తామన్నారు. అవును.. రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపునకు అయ్యే ఖర్చును భరించిన ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసింది. మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులను ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు సీఎం. అందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. విద్యార్థులు డిస్‌కంటిన్యూ కాకుండా.. భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్‌ను ఆదేశించారు.
శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో కేంద్రం విధానాలను ఎండగట్టిన సీఎం.. మెడిసిన్ విద్యార్థులకు అండగా నిలిచారు. ఉక్రెయిన్‌లో తెలంగాణకు చెందిన 740 మంది విద్యార్థులు ఉన్నారన్న సీఎం.. వారిని ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా శ్రమించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో వైద్యవిద్య భారంగా మారడం వల్లే విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్తున్నారన్నారు. భారత్‌లో కోటి రూపాయల్యే వైద్య విద్య.. ఉక్రెయిన్‌లో 25లక్షలకు దొరకడం వల్లే ఉక్రెయిన్‌కు వలసలు పెరిగాయన్నారు సీఎం. అందుకు కేంద్రం విధానాలే కారణమన్నారాయన.
కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో దేశం ఆర్థికంగా చితికిపోతోందన్నారు సీఎం కేసీఆర్. కోట్లమంది పేదరికంలోకి వెళ్లారని..నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. దేశంలో ఏదైనా పెరిగిందంటే.. అది మత పిచ్చి ఒక్కటేనంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్.
Also read:
Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!
Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!