AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష… ఈ ఏడాది రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్ బడ్జెట్‌..!

నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రాజెక్టులు, చీఫ్ ఇంజనీర్ల వారీగా చేపట్టాల్సిన పనులు, వాటికి జరపాల్సిన కేటాయింపులపై చర్చ జరిగింది.

నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష... ఈ ఏడాది రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్ బడ్జెట్‌..!
Balaraju Goud
|

Updated on: Feb 05, 2021 | 9:31 PM

Share

KCR Irrigation department review : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

ప్రాజెక్టులు, చీఫ్ ఇంజనీర్ల వారీగా చేపట్టాల్సిన పనులు, వాటికి జరపాల్సిన కేటాయింపులపై చర్చ జరిగింది. 2021-22లో రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌ అంచనాలు రూపొందించింది. వాటిలో ముఖ్యమైన పనులేవి? వెంటనే చేపట్టాల్సినవేవి? తదితర అంశాలను సీఎం సమీక్షించారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. మార్చి రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి అందే నిధులపై సీఎం గురువారం చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రానికి రాబోయే నిధులపై స్పష్టత వచ్చింది. ఇందుకు తగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ రూపొందించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ బడ్జెట్‌పై సీఎం చర్చించారు.

Read Also…. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆక‌స్మిక తనిఖీ.. డిప్యూటీ ఈవో నాగరాజుకు కీలక ఆదేశాలు