CM KCR Tour: భద్రాచలంలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. గోదావరి నదికి శాంతి పూజలు

|

Jul 17, 2022 | 12:41 PM

CM KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రాచలం పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం భద్రాచలం చేరుకున్న కేసీఆర్‌.. గోదావరి పరిసరాలను పరిశీలించారు...

CM KCR Tour: భద్రాచలంలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. గోదావరి నదికి శాంతి పూజలు
Telangana CM KCR
Follow us on

CM KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రాచలం పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం భద్రాచలం చేరుకున్న కేసీఆర్‌.. గోదావరి పరిసరాలను పరిశీలించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏరియల్‌ సర్వే ఉండగా, భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అది రద్దయ్యింది. ఇక పరిసరాలను పరిశీలించిన తర్వాత గోదారమ్మకు శాంతి పూజ నిర్వహించారు. అలాగే భద్రాచలం కరకట్టను పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా, గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. ముంపు గ్రామాలన్ని జలదిగ్బంధంలో ఉండిపోయాయి. భారీ వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి.

పునరావాస కేంద్రాలకు కేసీఆర్‌..

పర్యటనలో భాగంగా కేసీఆర్‌ అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి