CM KCR Press Meet Highlights : ప్రజలకు అవసరమైతే దేశంలో కొత్త జాతీయ పార్టీ.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

|

Feb 13, 2022 | 8:11 PM

దేశంలోని ప్రజలకు  అవసరమైతే కొత్త జాతీయ పార్టీని పెడతానని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు.  ప్రజలంతా కావాలంటే కచ్చితంగా ఈ విషయంపై ఆలోచిస్తానన్నారు.

CM KCR Press Meet Highlights : ప్రజలకు అవసరమైతే దేశంలో కొత్త జాతీయ పార్టీ.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Cm Kcr

దేశంలోని ప్రజలకు  అవసరమైతే కొత్త జాతీయ పార్టీని పెడతానని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు.  ప్రజలంతా కావాలంటే కచ్చితంగా ఈ విషయంపై ఆలోచిస్తానన్నారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుచేయడంలో తప్పేమీ లేదన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో  నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. పోరుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లు, బహిరంగ సభలలో కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని.. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని అంటున్నారు. అంతేకాకుండా కేంద్రంపై పోరుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురు నేతలతో సీఎం కేసీఆర్.. సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. కేంద్రంపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అయితే నేటి ప్రెస్ మీట్‌లో కూడా సీఎం కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణకు చెందిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఈ నెల 17న విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ సమావేశంపై, తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందించే అవకాశం కూడా ఉంది. ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma)ను బర్తరఫ్ చేయాలని కేసీఆర్ శనివారం యాదాద్రి భువనగరి జిల్లా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2022 07:51 PM (IST)

    సర్జికల్ స్ట్రైక్స్ పొలిటికల్ స్టంట్ అంటున్నారు..

    1. సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఆధారాలు చూపించాలనడం తప్పా?
    2. చాలామంది దీనిని పొలిటికల్ స్టంట్ అంటున్నారు.
  • 13 Feb 2022 07:41 PM (IST)

    దేశంలో ప్రజల ఫ్రంట్ రావాలి..

    1. జాతీయ పార్టీ పెట్టినా, పెట్టకపోయినా మేం కేంద్రంపై పోరు కొనసాగిస్తాం.
    2. రాజకీయ ఫ్రంట్‌ కాదు.. ప్రజల ఫ్రంట్‌ రావాలి.
    3.  దేశంలో ప్రభలమైన మార్పు రావాలంటే ప్రజలు కదలాలి.

  • 13 Feb 2022 07:39 PM (IST)

    జాతీయ రాజకీయాల్లో నాదే ప్రధాన పాత్ర..

    1. మమతతో ఫోన్‌లో మాట్లాడాను. ఆమె ఎప్పుడైనా హైదరాబాద్‌ రావొచ్చు.
    2. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ తో త్వరలోనే సమావేశమవుతాను.
  • 13 Feb 2022 07:30 PM (IST)

    అవసరమైతే జాతీయ పార్టీ పెడతాం..

    1. దేశంలో అవసరమైతే  జాతీయ స్థాయిలో  కొత్త రాజకీయ పార్టీ పెడతాం
    2. ప్రజలంతా కావాలంటే కచ్చితంగా ఈ విషయంపై ఆలోచిస్తాం
  • 13 Feb 2022 07:27 PM (IST)

    గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం..

    1. బీజేపీ హయాంలో గవర్నర్ల వ్యవస్థ మరింత దుర్వినియోగమవుతోంది.
    2. సర్కారియా కమిషన్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
    3. గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాల్సిన అవసరముంది
  • 13 Feb 2022 07:24 PM (IST)

    కాంగ్రెస్ తో పొత్తా? నో వే..

    1. నేను కాంగ్రెస్‌కు మద్దతు పలకడం లేదు
    2. రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలను మాత్రమే తప్పుబడుతున్నాను.
    3. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో గెలిచాం. మాకెందుకు కాంగ్రెస్‌తో టై అప్‌..
  • 13 Feb 2022 07:21 PM (IST)

    దళితుల బాగు కోసమే కొత్త రాజ్యాంగం..

    1. దేశంలో దళితుల జనాభా 19 శాతానికి పెరిగింది.
    2. దళితుల రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరముంది.
    3. దళితుల బాగుకోసమే కొత్త రాజ్యాంగం కావాలన్నాను..
  • 13 Feb 2022 07:18 PM (IST)

    అందుకే కొత్త రాజ్యాంగం కావాలన్నాను..

    1. దేశం బాగుపడాలంటే కొత్త రాజ్యాంగం కావాలన్నాను.
    2. అందరికీ సమాన హక్కులు అందాలన్నాను. ఇందులో తప్పేముంది?
    3. ఇప్పటికీ ఈ మాటలకు నేను కట్టుబడి ఉన్నాను.
  • 13 Feb 2022 07:15 PM (IST)

    రాష్ట్ర విభజనపై ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?

    1. రాష్ట్ర విభజనపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం మోడీకి ఏమోచ్చింది?
    2. ఎనిమిదేళ్ల నుంచి ఏపీ, తెలంగాణకు కేంద్రం ఏం చేసింది?
  • 13 Feb 2022 07:12 PM (IST)

    యాదాద్రికి మోడీ ఆహ్వానంపై ఆలోచిస్తాం..

    1. రాహుల్‌ గాంధీ ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా?
    2. బీజేపీని వెంటాడుతూనే ఉంటాం..
    3. యాదాద్రికి మోదీని ఆహ్వానించే విషయంపై మళ్లీ ఆలోచిస్తాం..
  • 13 Feb 2022 07:07 PM (IST)

    మతం పేరుతో రాజకీయాలు..

    1. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలకు పాల్పడుతోంది.
    2. కర్ణాటకలో ఏం జరుగుతుందో  దేశంలోని యువత ఆలోచించుకోవాలి.
  • 13 Feb 2022 07:04 PM (IST)

    ట్రంప్ కు ప్రచారం చేసి పెద్ద తప్పు చేశారు..

    అమెరికాలో ఎన్నికలుంటే అహ్మదాబాద్‌ లో సభ పెడతారా?
    ఏ ప్రధాని అయినా విదేశీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?

  • 13 Feb 2022 07:02 PM (IST)

    మోడీవన్నీ గోల్ మాల్ మాటలే..

    ప్రధాని మోడీవన్నీ గోల్‌మాల్‌ మాటలే..
    వాజ్‌పేయి సిద్ధాంతాలను ఆయన ఎప్పుడో గంగలో కలిపేశారు..

  • 13 Feb 2022 07:00 PM (IST)

    ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రో మంట..

    1. మోడీ ప్రభుత్వానికి కనీస సంస్కారం లేదు.
    2. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌ రేట్లు మళ్లీ పెరుగుతాయి.
  • 13 Feb 2022 06:57 PM (IST)

    క్షమాపణ రాజకీయాలు మోడీకి అలవాటే..

    1. మోడీ కరెక్టుగా ఉంటే రైతులకు ఎందుకు క్షమాపణలు చెబుతారు..
    2. గోద్రా ఘటనలోనూ ముస్లింలకు ఎందుకు క్షమాపణలు చెప్పారు?
  • 13 Feb 2022 06:52 PM (IST)

    దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి..

    1. ఈడీ, సీబీఐ, సీఐడీ పేర్లు చెప్పి తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోంది.
    2.  వారికి దొంగలు భయపడతారు.. నేనేందుకు భయపడతాను.. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి.
  • 13 Feb 2022 06:49 PM (IST)

    రఫేల్ కుంభకోణంపై సుప్రీంలో కేసు వేస్తాం..

    1. కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి చిట్టా అంతా వస్తోంది.
    2. రఫేల్‌ కుంభకోణం సుప్రీంకోర్టులో కేసు వేస్తాం..
  • 13 Feb 2022 06:46 PM (IST)

    దేశం అవినీతి కంపు కొడుతోంది..

    1. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపు కనపడుతోంది.
    2. బీజేపీ పాలనతో 33 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలిపారిపోయారు. వారిప్పుడు లండన్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. వీళ్లలో చాలామంది గుజరాతీలే..
  • 13 Feb 2022 06:43 PM (IST)

    మోడీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయింది..

    1. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది.
    2. మోడీ అబద్ధాలతోనే పాలనను కొనసాగిస్తున్నారు.
    3. గతంలో మిషన్‌ భగీరథ ప్రారంభ సభలోనూ పచ్చి అబద్ధాలాడారు.
    4. ఆయనే కాదు బీజేపీ నాయకులందరూ అబద్ధాల్లో బాగా ఆరితేరిపోయారు.
  • 13 Feb 2022 06:37 PM (IST)

    బీజేపీని తరిమికొట్టకపోతే దేశం సర్వనాశనం..

    1. మోడీకి దమ్ముంటే దేశాన్ని సింగపూర్‌, చైనా లాగా దేశాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఈ ప్రభుత్వానికి ఇవేవీ చేతకావడం లేదు.
    2.  బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టకపోతే దేశం సర్వనాశనమవుతుంది
  • 13 Feb 2022 06:34 PM (IST)

    నష్టపోయినా సరే విద్యుత్ సంస్కరణలు అమలు చేయం..

    1. విద్యుత్‌ సంస్కరణలను అమలు చేస్తే రాష్ట్రానికి అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి ఏడాదికి రూ.5వేల కోట్లు వస్తాయి.
    2. ఎఫ్‌ఆర్‌బీఎం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ సంస్కరణలను మేం అమలుచేయమన్నాం.
  • 13 Feb 2022 06:30 PM (IST)

    విద్యుత్ సంస్థలను వారికి కట్టబెట్టాలని చూస్తున్నారు..

    1. బీజేపీకి చందాలు ఇచ్చే వారికి విద్యుత్‌ సంస్థలను కట్టబెడుతున్నారు. వీటికి సంస్కరణలు అని పేరు పెడుతున్నారు.
    2. పార్లమెంట్‌లో విద్యుత్‌ సంస్కరణలు బిల్లు అమోదం పొందకముందే అమలు చేయాలని చూస్తున్నారు.
  • 13 Feb 2022 06:26 PM (IST)

    బండి సంజయ్ క్షమాపణ చెబుతాడా?

    1. గతంలో గజ్వేల్ సభలో పాల్గొన్న మోడీ ఒక్కో యూనిట్‌ కరెంట్ రూ.10 ఇస్తామన్నారు. ఇప్పుడేమో మాట తప్పారు. మరి దీనికి బండి సంజయ్ క్షమాపణ చెబుతాడా?
    2. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
    3. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం
  • 13 Feb 2022 06:19 PM (IST)

    బండి సంజయ్ ను చూస్తుంటే జాలేస్తోంది..

    1. నష్టపోయినా సరే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయం.
    2. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను చూస్తే జాలేస్తోంది. ఆయనకు చదువు వస్తదో, రాదో  తెలియడం లేదు.
  • 13 Feb 2022 06:14 PM (IST)

    మోడీ అబద్ధాల్లో ఆరితేరిపోయారు..

    నరేంద్రమోడీ అబద్ధాల్లో ఆరితేరిపోయారు. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.  దేశంలో విద్యుత్ సంస్కరణలను  అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొన్న పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ఈ విషయం చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో ఏడాదిలో అన్ని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్నారు. అదేవిధంగా కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వొద్దంటున్నారు. ఇప్పటికే ఏపీలో కొన్ని వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు.  మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.

Follow us on