
CM KCR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ విందును ఏర్పాటుచేయనున్నారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని సీఎం కేసిఆర్ తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరురుస్తోంది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు కేసీఆర్. కాగా రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఇఫ్తార్ విందులు ఏర్పాటుచేస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈనెల2 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న ముస్లిం ఉద్యోగులందరికీ పనివేళ్లలో వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి రోజు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. కాగా మే3 లేదా4న రంజాన్ పండగను జరుపుకోనున్నారు.
Also Read:Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!
Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
TOP 9 ET News: దెబ్బకు దండం పెట్టిన సింగర్ సునీత | 1100 కోట్ల క్లబ్‌లోకి RRR