Telangana: జిల్లాల్లో మిన్నంటేలా రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలు.. రూ.105 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్

|

May 25, 2023 | 5:11 PM

జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఖర్చులకు గాను జిల్లా కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Telangana: జిల్లాల్లో మిన్నంటేలా రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలు.. రూ.105 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్
Telangana CM KCR, Telangana CS Shanti Kumari
Follow us on

Telangana Formation Day: జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఖర్చులకు గాను జిల్లా కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.గురువారం డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. నూతన సచివాలయంలో నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సు ఇది కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను జూన్ 2 తేదీ నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. దశాబ్ధి ఏర్పాట్ల ఉత్సవాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చర్చించారు. కలెక్టర్లు, అధికారులకు ఏర్పాటపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు.

ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఆనతికాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా దశాబ్ధి ఉత్సవాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Telangana Cm Kcr

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..