Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.. సీఎం మార్పు వ్యాఖ్యలపై బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్..

తెలంగాణ రాజకీయాల్లోని ఆ కొత్త చర్చకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టేనా ? బీజేపీ నేతల లేవనెత్తిన డౌట్స్‌కు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చేశారా ? సీఎం రేవంత్ నాయకత్వానికి ఇక ఢోకా లేనట్టు తేలిపోయిందా..? పూర్తి వివరాలు ఓ సారి చూడండి..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.. సీఎం మార్పు వ్యాఖ్యలపై బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్..
Telangana Politics
Follow us

|

Updated on: Nov 03, 2024 | 9:13 AM

రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌లో నేతల తీరు, మాటలు భిన్నంగా ఉంటాయి. దీని వల్ల ఎప్పటికప్పుడు కొత్త చర్చలు పుట్టుకొస్తుంటాయి. ప్రత్యర్థులు కూడా కాంగ్రెస్‌లోని ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుని వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా తెలంగాణ కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేందుకు రాష్ట్రంలో సీఎంను దించేందుకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఒకరు.. సీఎం మార్పు ఖాయమని మరొకరు.. వరుసగా బీజేపీ నేతలు కామెంట్ చేయడం సరికొత్త పొలిటికల్ చర్చకు దారి తీసింది. రేవంత్‌ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కొద్దిరోజుల క్రితం కొత్త చర్చకు తెరలేపారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. రేవంత్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరగాలని కొందరు మంత్రులు భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రేవంత్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారంటూ చెప్పుకొచ్చారు..

2025 డిసెంబర్‌ నాటికి కొత్త సీఎం ఖాయమన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బండి సంజయ్ తర్వాత లేటెస్ట్‌గా బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. 2025 డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త సీఎం రాబోతున్నారని జోస్యం చెప్పారు. సీఎం రేసులో ముగ్గురు మంత్రులు ఉన్నారని, వారిలో ఎవరైనా సీఎం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గత 7 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ముఖ్యనేతలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు.

క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్

బండి సంజయ్ కామెంట్స్‌,  ఆ తర్వాత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. సీఎం ఉండగా కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తోందంటూ పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్. సీఎం రేవంత్, మంత్రులు కలిసి ప్రజాపాలన అందిస్తున్నారన్నారు. సీఎం, మంత్రులు స్వేచ్ఛగా పని చేస్తున్నారని.. మహేశ్వర్ రెడ్డికే బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేదంటూ కౌంటర్ ఇచ్చారు.

ప్రతిపక్షాల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు: మంత్రి పొంగులేటి

ఇదే విషయంపై శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. వచ్చే నాలుగేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటారని తేల్చేశారు. సీఎం మారుతారన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడటానికి ఏదో ఒకటి కావాలని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్సే గెలుస్తుందని.. అప్పుడు సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని పొంగులేటి వివరించారు.

ఇలా సీఎం మార్పు విషయం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్తకు చర్చకు దారి తీసింది.. అయితే.. ఈ విషయంలో మున్ముందు ఎలాంటి మాటల తూటాలు పేలుతాయోననని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..