Harish Rao: మన పిల్లలను స్థానికేతరులుగా మారుస్తారా.. మెడికల్ అడ్మిషన్ల హరీష్ రావు ఫైర్

|

Aug 07, 2024 | 6:29 PM

మెడికల్ అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు సరిగా లేని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. వీటి వల్ల మన పిల్లలే ఇక్కడ స్థానికేతరులుగా మారే అవకాశం ఉందన్నారు. 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని.. అదే పద్ధతిని విద్య విషయంలోనూ అమలు చేయాలని కోరారు.

Harish Rao: మన పిల్లలను స్థానికేతరులుగా మారుస్తారా.. మెడికల్ అడ్మిషన్ల హరీష్ రావు ఫైర్
Harish Rao On Medical Seats
Follow us on

మెడికల్ అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు సరిగా లేని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. వీటి వల్ల మన పిల్లలే ఇక్కడ స్థానికేతరులుగా మారే అవకాశం ఉందన్నారు. 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని.. అదే పద్ధతిని విద్య విషయంలోనూ అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఏ అంశంపైనా స్పష్టత లేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏ అంశంపైనా స్పష్టత లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదన్నారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే ప్రమాదముందని హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

నీళ్లు, నియామకాలు, నిధుల తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారు. నీళ్లు, ఉద్యోగాలు దక్కాయి. తెలంగాణ రాకముందు 40 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవి. కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా జీవో 124 తీసుకొచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. విద్య అడ్మిషన్లను ఉమ్మడి రాష్ట్రంలోని పాత పద్ధతి కింద 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ మరో పదేళ్ల పాటు ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. 1979లో జీవో 644లో విద్యా ప్రవేశాల్లో స్థానికతను ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమకు నిర్ణయించారు. ఆ ప్రాంతాల్లో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం ఉండదన్నారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జీవో నంబర్ 114 ప్రకారం పాత నిబంధనను పదేళ్లపాటు కొనసాగించాలని అందులో ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో 2,850 సీట్లను ఎంబీబీఎస్ సీట్లను 9 వేలకు పెంచిందన్న హరీష్ రావు, తెలంగాణ వచ్చేనాటికి ఉన్న కాలేజీల్లో మాత్రమే 15 ఓపెన్ కాంపిటీషన్ కోటా అమలు చేశాయన్నారు. రాష్ట్రం వచ్చాక ఏర్పాటు చేసిన కాలేజీల్లో వంద శాతం సీట్లు తెలంగాణకే ఇచ్చాం. దీంతో 520 సీట్లు అదనంగా మనకు వచ్చాయన్నారు.

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీలో లోకల్ స్టూడెంట్లకే ఇవ్వాలని జీవో తెచ్చామన్న హరీష్ రావు, దీంతో 24 కాలేజీల్లో తెలంగాణ పిల్లలకు 1071 సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణ పిల్లలు డాక్టర్ల కావాలనే తపనతో కేసీఆర్ ఈ పనిచేశారన్నారు. మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించుకోవాల తెలిపారు. సర్కార్ కొత్త జీవో ప్రకారం తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్తే నాన్ లోకల్ అయిపోరా? అని హరీష్ రావు ప్రశ్నించారు. మన తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ నిబంధన ప్రకారం వాళ్లు పీజీ సీట్లకు నాన్ లోకల్ అయిపోతారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడులో మాదిరి రూల్స్ ఫ్రేమ్స్ చేయాలని రాష్ట్ర సర్కార్‌కు హరీష్ రావు సూచించారు. అక్కడ ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఆరు నుంచి పది వరకు అక్కడ చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలన్నారు. కర్నాటక, కేరళలకు వాటి నిబంధనలు ఉన్నాయి. తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుందన్నారు.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ల పాటు ఉన్నందువల్ల పార్లమెంటు చట్టం ప్రకారం మేము పాత పద్ధతి కొనసాగించామని హరీష్ తెలిపారు. పదేళ్ల కాలం ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే జీవో 33 లో సవరణలు తేవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై అఖిలపక్షాన్ని పిలిస్తే సూచనలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీ వేయాలన్న హరీష్ రావు, జీవోకు సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..