Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఏడు వైద్యకళాశాలలకు ఆమోదం లభించింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది. గతంలోనే సీఎం కేసీఆర్ మహబూబాబాద్, జగిత్యాల జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
Cabinet has resolved to establish 7 medical colleges at Mahbubabad, Sangareddy, Jagtyal, Nagar Kurnool, Wanaparthy, Kothagudem & Manchirial
Prior to formation of Telangana, only 4 Govt medical colleges were built. From 2014 -18, KCR Govt has established 5 & now 7 more to come up
— KTR (@KTRTRS) May 30, 2021
Also Read: