Telangana Cabinet: ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు అన్యాయం..రైతుల‌ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత దూర‌మైనా: టీఎస్ క్యాబినేట్‌

|

Jun 19, 2021 | 11:00 PM

Telangana Cabinet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాల‌ను తెలంగాణ కేబినేట్ నిర‌సించింది. ఏపీ చేప‌డుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను త‌ప్పుప‌ట్టారు. ఎన్ జీ టీ తో పాటు...

Telangana Cabinet: ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు అన్యాయం..రైతుల‌ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత దూర‌మైనా: టీఎస్ క్యాబినేట్‌
Ts Cabbinate
Follow us on

Telangana Cabinet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాల‌ను తెలంగాణ కేబినేట్ నిర‌సించింది. ఏపీ చేప‌డుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను త‌ప్పుప‌ట్టారు. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని శ‌నివారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేబినెట్ స‌మావేశం తీవ్రంగా ఖండించింది. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల‌ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళతామని ఆయన తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కాల్వల నిర్మాణం సరైంది కాదని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఏపీ ప్రాజెక్టులపై ఎన్జీటీ, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ‌కు కృష్ణా నీటి వాటాను ద‌క్కించుకోవ‌డానికి రాష్ట్ర మంత్రి మండ‌లి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో ప్ర‌ముఖంగా.. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ) ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read: TS Cabinet : క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయండి : కేబినెట్

Telangana: 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.. మ‌రిన్ని నిర్ణ‌యాలు

Smita Sabharwal: తన జన్మదినం సందర్భంగా మొక్క‌లు నాటిన స్మితా సబర్వాల్