TSPSC Paper Leak: కేటీఆర్‌, హరీశ్‌లకూ పేపర్లు వెళ్లాయి.. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంచలన ఆరోపణలు

|

Mar 17, 2023 | 3:06 PM

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం (మార్చి 17) ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

TSPSC Paper Leak: కేటీఆర్‌, హరీశ్‌లకూ పేపర్లు వెళ్లాయి.. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంచలన ఆరోపణలు
Rs Praveen Kumar
Follow us on

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం (మార్చి 17) ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నన్ను, మా పార్టీ కార్యకర్తల అరెస్ట్ ను ఖండిస్తున్నాను. టీఎస్‌పీఎస్సీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమయ్యాయి. పరీక్షలు పేపర్స్ లికేజ్ వెనుక పెద్దల హస్తం ఉంది. ఇది 30లక్షల నిరుద్యోగుల సమస్య. Tspsc ని నమ్మినందుకు నిరుద్యోగులను నిండా ముంచారు. IP అడ్రెస్  తో హాక్ చేసారన్నది కేవలం కల్పితం. పెన్ డ్రైవ్‌లో డౌన్లోడ్ ఉండదు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా దొంగలించడం అంత సులభం కాదు. శంకర లక్ష్మి ద్వారా పాస్ వర్డ్ దొంగలించడం అసాధ్యం. ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరు ఉన్నారో తెలియాలి. దీనికి టీఎస్పీఎస్సీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీనిపై ఉద్యమిస్తున్న మా లాంటి వాళ్ల ఫోన్లను ట్రాప్ చేస్తున్నారు. మా ఆందోళనతో గ్రూప్ 1 పరీక్ష రద్దు చేశారు..మంచి నిర్ణయం’

ఈ వ్యవహారంలో ప్రవీణ్ కేవలం పావు మాత్రమే. హరీష్ రావు, కేటీఆర్‌లకు కూడా పరీక్ష పేపర్లు వెళ్లాయి. అలాగే ఎమ్మెల్సీ కవిత మనుషులకు పేపర్లు అందాయి. ఈ ఆధారాలు నేను సీబీఐ లేదా హైకోర్ట్ కు అందిస్తా. సీఎం కేసీఆర్ పై నమ్మకం లేదు. ఆర్టికల్ 310 ప్రకారం గవర్నర్ జనార్దన్ ను డిస్మిస్ చేయాలి. నేర ప్రవర్తన ఉన్న ప్రవీణ్ కు 103 మార్కులపై అనుమానం ఉంది. ప్రవీణ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారి పై నమ్మకం లేదు. కేవలం గ్రూప్ 1 ఒక్కటే కాదు మిగతా పరీక్షలు పేపర్స్ లీక్ అయ్యాయి. ఈ వ్యవహారం నుంచి చైర్మన్ జనార్దన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు. నిరుద్యోగులు ఆంటే మంత్రులకు లెక్క లేదు. లిక్కర్ స్కామ్, టీఎస్‌పీఎస్సీ స్కామ్‌లపై కేసీఆర్‌ మాట్లాడాలి. ఈ స్కామ్ వెనుక పెద్ద తలలు ఉన్నాయి. BJP, BRS రెండు ఒక్కటే. సింగరేణి పరీక్షలు లీక్ అయ్యాయి. నిరుద్యోగ కోచింగ్ సెంటర్లు ఏమయ్యాయి. జైల్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రాణాలు కాపాడాలి. నా పార్టీ ఆఫీస్‌లో ధర్నా చేస్తుంటే పోలీసులు భగ్నం చేశారు. CM KCR మా గొంతు నొక్కుతున్నారు. చైర్మన్ జనార్దన్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలి’ అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..