Telangana: మండే ఎండ్లలో కూల్ న్యూస్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

| Edited By: TV9 Telugu

Apr 15, 2024 | 6:00 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Telangana: మండే ఎండ్లలో కూల్ న్యూస్.. ఈ జిల్లాలకు వర్ష సూచన
Rain Alert
Follow us on

ప్రజంట్ ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే బయటకు పోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే 2 రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

 వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఇలానే ఎండలు కొనసాగుతాయి.  ఏప్రిల్ 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇక తెలంగాణలో ఈ సమ్మర్ సీజన్‌లో ఫస్ట్ టైమ్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 41.3,  నిజామాబాద్‌లో 41.2, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. స్టేట్‌ వైడ్‌గా ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని CS శాంతి కుమారి ఆదేశించారు. స్కూల్ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ కూలీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు CS.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి