BJP Millennium March: బీజేపీ నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా.. కారణం అదేనా.. మళ్లీ ఎప్పుడంటే..?

|

Nov 13, 2021 | 4:43 PM

ఈ నెల 16న ట్యాంక్ బండ్ పై బీజేపీ చేపట్టనున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ నెల 16న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేయాలని భావించింది బీజేపీ.

BJP Millennium March: బీజేపీ నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా.. కారణం అదేనా.. మళ్లీ ఎప్పుడంటే..?
Bjp
Follow us on

BJP Millennium March: ఈ నెల 16న ట్యాంక్ బండ్ పై బీజేపీ చేపట్టనున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ నెల 16న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేయాలని భావించింది బీజేపీ. నెల 16 వరకు అన్ని యూనివర్సిటీల దగ్గర, రౌండ్ టేబుల్ సమావేశాలు, చైతన్య ర్యాలీలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంజయ్ తెలిపారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాల నుంచి జన సమీకరణ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడో వారంలో మిలియన్ మార్చ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Read Also…  SBI Customers Alert: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు, పన్ను వసూలు..!

T Congress Meet: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారదా?.. గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా అదే పంచాయితీ!